Today 18 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు సంపద పెరిగే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు ఈ రాశి వారి జీవితం బాగుంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉదయం సాధిస్తారు. ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే అప్పులు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రానీయకుండా ఉండాలి. పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఏవైనా ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. సాయంత్రం విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండటమే మంచిది. స్నేహితులతో ఈరోజు సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. కొందరు వ్యాపారులకు నష్టాన్ని కలిగించే పనులు చేయవచ్చు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులకు దూరంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు ఖర్చులను పరిమితి చేయడం మంచిది. డబ్బు వృధా అయితే తిరిగి రావడం కష్టంగా మారుతుంది. ఇతరులతో సంయమనం పాటించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా శుభకార్యానికి వెళ్లాల్సి వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు సంప్రదింపులు జరపాలి. ఆగిపోయిన బకాయిలు తిరిగి వసూలు అవుతాయి. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి మద్దతు ఉంటుంది. కొందరు శత్రువులు పనులను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. పెద్దల అండతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : మీ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. పెండింగ్లో ఉన్న డబ్బును వసూలు చేసుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ చేసేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించాలని అనుకునేవారు సంప్రదింపులు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు షాపింగ్ చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.