Today 18 December 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొందరు వ్యాపారులు అదనంగా ఆదాయాన్ని పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితులతో సరదాగా విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు లాభాలు పొందేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థుల కెరీర్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పనులు ప్రారంభించాలనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు సకాలంలో ఆదాయం రావడంతో సంతృప్తిగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఆగిపోయిన బకాయిలు తిరిగి వసూల్ అవుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి అనుకూలమైన సమయం ఉండడంతో ఈరోజు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యాపారులకు పెద్దల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఆదాయాన్ని పొందుతారు. ప్రియమైన వారికోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. దీంతో అదనంగా ఆదాయాన్ని పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపార అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే కొందరి సలహా మేరకు ఆదాయాన్ని పొందుతారు. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అనుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొద్ది కష్టమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాలు అధికంగా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.