spot_img
Homeఆధ్యాత్మికంToday 15 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు లక్కీ డే.....

Today 15 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు లక్కీ డే.. ఏదంటే అది పూర్తవుతుంది..

Today 15 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. మరికొన్ని రాశుల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాటల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. శక్తి సామర్ధ్యాల మీదకే డబ్బులు ఖర్చు చేయాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు వ్యవహారాలు జరపకూడదు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంటికి బంధువుల రాకతో సందడిగా మారుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను కలుస్తారు. సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఇదే సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు పెద్దలను సంప్రదిస్తారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ప్రయత్నం చేయాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారికి బహుమతులు అందజేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవిత భాగస్వామి సపోర్ట్ తో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : స్నేహితులతో కలిసి విహారయాతులకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యవసర సమయానికి డబ్బు అందకపోవచ్చు. అయితే కొందరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఈ రోజు లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారులు అండదండలు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పూర్వీకుల ఆశకి సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతారు. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular