Today 15 July 2025 Horoscope: మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈరోజు ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు ఆలోచించి జరపాలి. ఎందుకంటే ఒకసారి డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. కుటుంబ సభ్యుల్లో ఒకరు వివాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. అలాంటి వారితో సంయమనం పాటించాలి. గొడవలోకి వెళితే మరింత సమస్యగా మారుతుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆసుపత్రుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొంటారు. భవిష్యత్తుకు సంబంధించి తల్లిదండ్రులతో చర్చిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పెద్దలతో విభేదాలు ఉండొచ్చు. అయితే మాటల మాధుర్యంతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల విషయంలో చర్చ జరుగుతుంది. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు. బ్యాంకు రుణం పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. అయితే ఈరోజు కొంత ఫలితం ఉంటుంది. ఉద్యోగులు తాము చేసే ప్రాజెక్టులకు తోటి వారు సహాయం చేస్తారు. అధికారుల ప్రశంసలు కూడా అందుతాయి. ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేస్తారు. దీంతో ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు కొత్తగా భాగస్వాములను చేర్చుకోవాలని అనుకుంటే ఇతరులతో చర్చించాలి. అయితే పెట్టుబడుల విషయంలో జీవిత భాగస్వామి సలహా పాటించాలి. కొత్త వ్యక్తులు ఇచ్చే సలహాలు తీసుకోవద్దు. ఇతరులకు ఈరోజు దానం ఇవ్వడానికి ముందుకు వస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కన్య రాశి వారు ఈరోజు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆస్పత్రులా పాలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండద్దు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులకు కొత్త ఆదాయం సమకూరుతుంది. కానీ అదనపు ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగులు ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులతో కలిసి ఒక శుభకార్యం లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఖర్చుల విషయంలో పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే దుబారా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా స్నేహితుల్లో ఒకరు మోసం చేసి అవకాశముంది. కొత్త వ్యక్తులతో డబ్బు వ్యవహారం జరపకుండా ఉండడమే మంచిది. వ్యాపారులు తమ అభివృద్ధి కోసం ఇతరులతో చర్చలు జరుపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . రాజకీయ నాయకులు అయితే ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండనుంది. ప్రజల మద్దతుతో గుర్తింపు వస్తుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలను వాడకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : విహారయాత్ర వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు.. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ విషయం తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉండనుంది. గతంలో వీరు పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి వస్తే ఇతరులతో చర్చలు జరుపుతారు. అయితే వీరికి తోటి వారి సపోర్టు ఉండనుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు కొత్తగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందడంతో పాటు పదోన్నతి కూడా దక్కించుకునే అవకాశం ఉంది.