Today 14 October 2025 Horoscope: గ్రహాల మార్పుకు అనుగుణంగా రాశుల మార్పు ఉంటుంది. దీంతో కొందరి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఏర్పడతాయి. మంగళవారం కొన్ని రాశుల వారు అనుకున్న పనులను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడానికి శ్రమ పడాల్సి వస్తుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణము ఉంటుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల పెడత ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామిగా వాదన చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల వాతావరం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో లాభాలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు తోటి వారి సహాయంతో అనుకున్న పనుల పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ప్రియమైన వారికి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి పట్టుదలతో ఉంటారు. ఎవరి మాట వినకుండా అనుకున్న పనిని పూర్తిచేసే వరకు విశ్రమించకూడదు. ఉద్యోగులకు కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. అయినా అనుకున్న పనులను పూర్తి చేస్తాను. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. గతంలో వీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు చేసే కొన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దీంతో కార్యాలయాల్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలు ఏర్పడతాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు అనుకున్న పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తోటి వారి సహాయంతో ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పరీక్షల్లో రాణిస్తారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. దీంతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతారు. వీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వాహనాలపై వెళ్లడం మంచిది కాదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : గతంలో చేపట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే ఇతరుల వద్ద డబ్బు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు ఇటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. తోటి వారి సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు మెరుగని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.