Today 13 September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శనివారం వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా ఆదాయం పెరగడంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. అయితే ఖర్చులు విపరీతంగా పెరగడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించని లాభాలు పొందుతారు. ఆస్తివివాదం ఉంటే పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు చేయడంతో సక్సెస్ అవుతాయి. అనుకున్న దానికంటే ధన లాభం ఎక్కువగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. వృత్తిపరమైన డాక్టర్లు ఆదాయం పెంచుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఆదాయం మెరుగవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడడంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. బంధువుల నుంచి ధన లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . వ్యాపార వృద్ధిపై కేంద్రీకరిస్తారు. బంధువుల తో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగం చేసేవారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఇతరులతో వాగ్వాదం ఉంటుంది. అయితే ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో పరిచయం ఏర్పడిన వ్యాపారులు వారితో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. వృత్తిపరమైన ఉద్యోగులకు కలిసి వస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు తగ్గుతాయి. బంధువుల నుంచి పెళ్లి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వీటితో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలు తీసుకొస్తాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదాస్పద విషయాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . ఈ రాశి వారు కొత్త సమాచారాన్ని అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే అవి లాభాలు తీసుకొస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.