Today 13 July 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులు మారుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఆదివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వ్యాపారాలు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణంలో ఉంది. మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎవరికైనా అప్పు ఇవాల్సి వస్తే ఆలోచించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటికి చుట్టాలు రాకతో ఇల్లు సందడిగా గడుస్తుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కొన్ని విషయాల పట్ల ఆందోళన చెందుతారు. అయితే జీవిత భాగస్వామి సలహాతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే తోటి వారి మద్దతుతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడతాయి. వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తికి సంబంధించిన చర్చలు జరుగుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఓ శుభకార్యం గురించి చర్చిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఇంట్లో వివాదం ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కుటుంబానికి సంబంధించిన రహస్యాలను స్నేహితులతో కూడా పంచుకోవద్దు. పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవడమే మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొత్తగా ఎటువంటి పనులు ప్రారంభించవద్దు. వ్యాపారులు కొత్త భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. వస్తువుల కొనుగోలుకు డబ్బు కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో అప్పులు చేయాల్సి వస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. దుబారా ఖర్చు విషయంలో ఆలోచించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తగా పనులను ప్రారంభిస్తారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులను అప్పుడే నమ్మకుండా ఉండాలి
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆన్లైన్లో పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం సంపాదించడానికి మార్గం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరికి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆదాయం పెరిగిన అందుకు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. ఏదైనా ఒక పనిని ప్రారంభించే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ రహస్యాలను వ్యాపార భాగస్వామిలతో పంచుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.