Homeఆధ్యాత్మికంToday 12 December Horoscope: ఈ రోజు ఈ రాశి వారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..

Today 12 December Horoscope: ఈ రోజు ఈ రాశి వారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..

Today 12 December Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు ఏ పని ప్రారంభించినా వెంటనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికి డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు అవసరం పడితే ఇతరుల వద్ద నుంచి అప్పు చేస్తారు. అయితే తిరిగి చెల్లించడం కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం అనుకోకుండా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. ఎవరికి డబ్బు ఇవ్వడం ఈరోజు శ్రేయస్కరం కాదు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . . ఈ రాశి వారు గతంలో కంటే ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరుల వద్ద నుంచి ఆదాయాన్ని పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు గురువుల మద్దతు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు నిజాయితీతో పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు బ్యాక్ బాలన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది. అయితే పెద్దలను సంప్రదించిన తర్వాతనే పెట్టుబడులకు ముందుకు వెళ్లాలి

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నట్లుండి వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. తమ శక్తి, సామర్ధ్యాలకు మించి పనులు చేయడంతో అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో అనుకున్న పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . . ఈ రాశి వారు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అయితే వారి నుంచి బయటపడతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో కొత్తవారిని నమ్మకూడదు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి ఈ రోజు లాభాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
Oktelugu Epaper
Exit mobile version