Peddi Movie Producer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం వచ్చే ఏడాది మార్చి 27 న విడుదల కాబోతున్న నేపథ్యం లో, మూవీ టీం ఇప్పటి నుండే ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. ముందుగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక రీసెంట్ గా విడుదల చేసిన ‘చికిరి చికిరి’ వీడియో సాంగ్ కి అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ పాటకు 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, స్పాటిఫై, జియో సావన్ ఇలా అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో దుమ్ము లేపుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో గత మూడు రోజులుగా వస్తున్న వార్తలు రామ్ చరణ్ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేశాయి.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కాస్త ఊరట ని ఇచ్చే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ ని ఎట్టి పరిస్థితిలోనూ జనవరి నెలాఖరుకి పూర్తి చెయ్యాలని చూస్తున్నారట. ముందు ప్రకటించినట్టు గానే ఈ సినిమాని మరచి 27 నే విడుదల చేయబోతున్నారట. వాస్తవానికి పెద్ది చిత్రం వాయిదా పడుతుంది, ఆ సినిమా విడుదలయ్యే తేదీ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారని సోషల్ మీడియా లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ పేజీల నుండి వార్తలు వచ్చాయి.
ఎందుకంటే ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నది ఒకే నిర్మాణ సంస్థ కాబట్టి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ, మైత్రీ మూవీ మేకర్స్ కి బాగా సన్నిహితులైన కొంతమంది సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేవి అవాస్తవాలని, మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది పుట్టించిన పుకార్లు అని, పెద్ది సినిమా ప్లాన్ చేసుకున్న ప్రకారమే షూటింగ్ పూర్తి అవ్వుధి అని, మార్చ్ 27 నే విడుదల చేస్తామని, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తామని అంటున్నారు. కానీ ఇదంతా జనవరి నెలాఖరు లోపు పెద్ది మూవీ షూటింగ్ పూర్తి అయితేనే ఇవన్నీ జరుగుతాయి, లేదంటే మార్చ్ 27 న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.