Today 11 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండగా.. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే అధికారులకు తో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఆర్థికపరమైన అంశాలతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను మనకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం పెరిగేందుకు మార్గం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. ఇంట్లో అనుకోకుండా శుభకార్యం జరుగుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. పై చదువుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు తమ పనులను చెక్క పెట్టుకుంటారు. ఉద్యోగులు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో ఆశికి సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి అధిక ప్రయోజనాలను పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు అనుకున్న ఆదాయాన్ని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు కూడా ఉండడంతో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని తప్పుల నుంచి గుణపాటాలు నేర్చుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా పెట్టుబడును పెట్టాల్సి వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. గృహ నిర్మాణానికి వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లడం మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పెద్దల అండదండ ఉండడంతో లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. కొన్ని పనుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు స్నేహితులను సంప్రదిస్తారు.