Today 11 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాసిన వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరికి తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తారు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గ్రహాల అనుకూలతతో కొన్ని పనులను త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థుల కెరీర్ విషయంలో చర్చ ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. వీరితో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉండే అవకాశం ఉంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థులతో బెడద ఉంటుంది. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సహకారంతో ప్రాజెక్టులన్ని వెంటనే పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడకూడదు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగా క్షణాలు ఉంటాయి. వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
