Today 10 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో వ్యాపారులకు అనుకోకుండా అదృష్టం పట్టణంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని పనులు పూర్తి కావడానికి కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాల నుంచి ఉద్యోగ శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వారికి ఈరోజు కొన్ని విషయాలు అదృష్టం కలగనుంది. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే గురువుల మద్దతును తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు కష్టంగా పూర్తవుతాయి. నేరాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకూడదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులు ఈజీగా పూర్తవుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. దీంతో పొడి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. సమాజంలో గౌరవం పెరగడంతో అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు దుబార ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారికోసం విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల కెరియర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ధన లాభం వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. మెదడుకు పదును పెట్టడంతో ఉద్యోగులు రాణిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇంటి నిర్మాణానికి ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పథకాలు అందుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. ఖర్చులు నియంత్రణ లోకి వస్తాయి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు అందుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.