Temple: భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ప్రతీ గ్రామంలో తమకు నచ్చిన దైవాన్ని నెలకొల్పి పూజలు చేస్తుంటారు.దేశంలోని ప్రముఖ ఆలయాలలు స్వయంభూగా వెలిశాయి. మరికొన్నింటిని రాజులు, ప్రముఖులు కట్టించారు. అయితే ఎలాంటి దేవాలయం అయినా ప్రహరీ గోడ, తలుపులు ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలుఉంచి భద్రతను పర్యవేక్షిస్తారు. అయితే ఏపీలోని ఓ ఆలయానికి ఎటువంటి తలుపులు లేవు. అంతేకాకుండా ఈ ఆలయానికి తలుపులు పెడదామని తీసుకొచ్చారు. కానీ అమ్మవారు కలలోకి వచ్చి తలుపులు వేయవద్దని అన్నారట. ఈ మాటతో తలుపును పక్కన వేశారు. అయితే ఆ తలుపులు మహా వృక్షంలా పెరిగాయి. ఇంతటి ఘనత సాధించుకున్న ఆలయం ఏపీలో ఎక్కడుందో తెలుసా?
సాధారణంగా తలుపులు లేని ఆలయం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని శని సింగాపుం గురించి చెప్పుకుంటాం. ఇక్కడ శనీశ్వరాలయానికి మాత్రమే కాకుండా ఇళ్లకు కూడా ఎలాంటి తలుపులు వేయరు. కానీ ఇలాంటి ఆలయమే ఏపీలోని సూళ్లూరు పేట చెంగాలమ్మ ఆలయం గురించి చెప్పవ్చు. సూళ్లురుపేట చెంగాలమ్మ ఆలయం గురించి అడగ్గానే ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని భక్తులు కథలుగా చెబుతూ ఉంటారు. ఏపీ, తమిళనాడు బార్డర్ లోని సూళ్లూరుపేటలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి తలుపులు అసలే ఉండవు. అయితే ఇందుకో చరిత్ర ఉంది. అదేంటంటే?
పూర్వకాలంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కాళింగ నదిలోని సుడిగుండంలో మునిగాడు. దీంతో తనను కాపాడాలని అరుస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో అతడికి ఓ బండరాయి తగిలింది. ఆ బండరాయి తో సహా ఆ వ్యక్తి ఎగిరి ఒడ్డుపై పడ్డాడు. ఆ తరువాత తనకు మెళకవ వచ్చిన తరువాత అక్కడ చూస్తే ఎవరూ కనిపించలేదు. దీంతో ఆ విషయాన్ని అతడు గ్రామస్థులకు చెప్పాడు. అయితే గ్రామస్థులకు అ బండరాయిని చూడ్డానికి రాగా దక్షణ ముఖముతో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించింది. అయితే గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు చేశారు. ఆ తరువాత విగ్రహాన్ని కదిలిద్దామని ప్రయత్నించారు. రాత్రి సమయం గడిచినా ఎంతకీ విగ్రహం కదలకపోవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఓ వ్యక్తి కలలో వచ్చి తన విగ్రహాన్ని ఎవరూ కదపొద్దు అని చెప్పడంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచారు.
నీటి సుడిగుండం నుంచి అమ్మవారి పుట్టింది కాబట్టి ఆ గ్రామానికి సూళ్లూరు పేట అని పెట్టారు. అలాగే చెంగలమ్మ అమ్మవారిని నిత్యం కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ ఆలయానికి తలుపులు నిర్మిద్దామని తీసుకురాగా.. మరోసారి అమ్మవారు కలలోకి వచ్చి తనకు తలుపులు వేయొద్దని చెప్పిందట.దీంతో తీసుకొచ్చిన తలుపులు పక్కన వేశారట. అయితే ఆ తలుపుల నుంచి చిన్న మొక్క ప్రారంభమై మహా వృక్సంగా మారిందట. అప్పటి నుంచి అమ్మవారు 365 రోజులు నిత్యం భక్తులను ఆశీర్వదిస్తారని స్థానికులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఎక్కువగా వస్తుంటారు.