వైశాఖ పౌర్ణమి రోజు ఏ పూజలు చేయాలో తెలుసా?

అయితే వైశాఖ పౌర్ణమి రోజున రావిచెట్టుకు ప్రత్యేక పద్ధతులతో పూజలు చేయాలి. రావి చెట్టుకు పూజ చేసే సమయంలో నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టాలి. సూర్యోదయం తరువాతనే రావి చెట్టుకు పూజ చేయాలి. ఈరోజున ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలనుకుంటే ముందుగా రావి చెట్టుకు పూజ చేసి ఆ తరువాత కొత్త పనులు మొదలు పెట్టాలి.

Written By: Neelambaram, Updated On : May 21, 2024 4:21 pm

vishaka pournami

Follow us on

ప్రతీ ఏడాది వచ్చే వైశాఖ పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో శ్రీహరి భక్తులను పలు విధాలుగా ఆశీర్వదిస్తారని అంటారు. 2024 మే 23న వైశాఖ పౌర్ణమి రాబోతుంది.ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున రావిచెట్టుకు పూజలు చేయడంతో పాటు దాన, ధర్మాలు చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే వైశాఖ పౌర్ణమి రోజున ఇంకా ఎలాంటి పూజలు చేయాలి? ఆ వివరాల్లోకి వెళితే..

పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో మహా విష్ణువు రావిచెట్టుపై ఉంటారని తెలుపుతోంది. దీంతో రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల విష్ణువు భక్తులను ఆశీర్వదిస్తారని అంటున్నారు. కొన్న గ్రంథాల ప్రకారం చెట్లను పూజించడం వల్ల చెడు ప్రభావం నుంచి బయటపడుతారు. ఇక వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పూర్వీకులు సంతోషిష్తారట. వైశాఖ పౌర్ణమి రోజున చెట్లను నాటడం వల్ల బృహస్పతి గ్రహం కలిగించే బాధల నుంచి విముక్తి పొందుతారు.

అయితే వైశాఖ పౌర్ణమి రోజున రావిచెట్టుకు ప్రత్యేక పద్ధతులతో పూజలు చేయాలి. రావి చెట్టుకు పూజ చేసే సమయంలో నీళ్లలో పాలు, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టాలి. సూర్యోదయం తరువాతనే రావి చెట్టుకు పూజ చేయాలి. ఈరోజున ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలనుకుంటే ముందుగా రావి చెట్టుకు పూజ చేసి ఆ తరువాత కొత్త పనులు మొదలు పెట్టాలి.

కొందరి జాతకంలో వితంతు యోగం ఉంటుంది. ఇలాంటి వారికి ఈరోజు రావి చెట్టుతో ఈరోజు పెళ్లి చేస్తారు. హిందూమతం ప్రకారం తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వైశాఖ మాసంలోరావి చెట్టుకు పూజ చేయడం వల్ల అంతా మంచే జరగుతుందని చెబుతున్నారు.