Vinayaka Chavithi : వినాయక చవితి పండగను భక్తులంతా ఘనంగా నిర్వహించుకుంటారు. గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి కాలనీ, వీధిలో గణపతి విగ్రహాలు నెలకొల్పి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పట్టణాల్లో అయితే డీజే సౌండ్లు, ప్రత్యేక ప్రోగ్రామ్లతో సందడి చేస్తుంటారు. అయితే ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు కూడా చేపట్టింది. అంతేకాదు అనుమతులు తీసుకొనే ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
వినాయకుడి పుట్టుక జరిగింది ఇలా..
వినాయకుడిని పార్వతీ దేవి సున్నిపిండితో తయారు చేసింది. స్నానం చేయడానికి సిద్ధం అవడానికి సున్నిపిండిని కలుపుతుండగా యథాలాపంగా ఓ బాలుడి రూపం చేస్తుంది పార్వతిదేవి. అది చూడటానికి చాలా అందంగా ఉండటంతో అమ్మవారు ప్రాణం పోస్తుంది అమ్మవారు. ఆ బాలుడి ముద్దులొలికే మాటలు వింటుంది. కానీ స్నానానికి ఆలస్యం అవుతుందని గుర్తించి బాలుడిని కాపలా ఉండమని స్నానానికి వెళ్తుంది పార్వతీ దేవి. ఇంతలో శివుడు బయట నుంచి వచ్చి పార్వతీ దేవి మందిరంలోకి వెళుతుండగా బాలుడు అడ్డుకుంటాడు. గణేషుడికి శివయ్యకు మధ్య జరిగిన వాగ్వాదంలో శివుడు కోపంతో బాలుడి శిరస్సు ఖండిస్తాడు. పార్వతీ దేవి వచ్చి విషయం తెలుసుకొని తన బిడ్డను బతికించాల్సిందేనని పట్టుపట్టడంతో శివుడు గజాసురుడు అనే ఏనుగు తలను అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. ఇది గణపతి పుట్టుక వెనున కథ. ఆ రోజునే మనం అందరం వినాయక చవితి చేసుకుంటాం.
అసలు వినాయక చవితి రోజు తులసీ దళాలతో పూజ చేయాలా వద్దా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ చేయవచ్చో లేదా? పండితులు ఏమి చెబుతున్నారు. పురాణాల్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల్లో ఏముందంటే..
వినాయకుడికి తులసీ దళాలతో పూజ చేయకూడదని రెండు పురాణాల్లో రాసి ఉంది. అవి ఏంటంటే శివ పురాణం, గణేశ పురాణం. అయితే శివ పురాణంలో ప్రకారం.. గణపతి ధ్యానం చేస్తుండగా తులసి ఆయన వద్దకు వస్తుంది. ఆయన ధ్యాన రూపం నచ్చి తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. కానీ తులసి కోరిక ఇష్టంలేని విఘ్నేశ్వరుడు తులసీ దేవితో పెళ్లి తిరస్కరిస్తాడట. ఆగ్రహం వ్యక్తం చేసిన తులసి వినాయకుడికి ఇక ఎవరితోనూ వివాహం జరగకూడదని శపించిందట. దీనికి ప్రతిగా వినాయకుడు కూడా తులసిని శపించాడట. ఇకపై తనకు తులసీ దళాలతో పూజ చేయకూడదని ముల్లోకాలకు తెలియజేశాడట. గణేశ పురాణంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
పండితులు ఏం చెబుతున్నారు..
సాధారణంగా నిత్యం చేసే ఆరాధనలో తులసీ దళాలతో వినాయకుడిని పూజించడం కరెక్టు కాదని పండితులు చెబుతున్నారు. పురాణాల్లో ఉన్న కథల ఆధారంగా ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు పండితులు. అయితే ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో నిత్య పూజలోనూ తులసీ దళాలు ఉపయోగిస్తారు.
వినాయక చవితికి తులసీ దళాలతో పూజించవచ్చా లేదా..
పురాణాల ప్రకారం గణపతికి తులసీ దళాలతో పూజించడం ఇష్టం ఉండదు. కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం పూజించవచ్చు అంటున్నారు పండితులు. వినాయక చవితి రోజు 21 రకాల పత్రాలతో గణపతిని పూజించడం ఆచారం. ఆ 21 రకాల్లో దూర్వా, బిల్వ, ఆర్గవద, దాడిమి, బదరీ, కరక, దేవదారు, శమీ, అశ్వత్థ, అర్జున, మాధుక, నేరేడు, వంటి పత్రాలున్నాయి. ఈ 21లో తులసీ పత్రం కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఒక్క వినాయక చవితికి మాత్ర తులసీ దళాలను పూజించవచ్చని, ఎలాంటి దోషాలు ఉండవని చెబుతున్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Things you dont know about vinayaka chavithi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com