Lord Ganesha: పార్వతి పరమేశ్వరుల ప్రియ పుత్రుడు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా వాడవాడలా గణనాథుడు కొలువయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మండపాలను ఏర్పాటు చేసి.. కొన్నిచోట్ల వినాయక విగ్రహాలను తీసుకొచ్చారు. వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే గణనాథుడు ప్రాణప్రతిష్ట కావడమే తర్వాయి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ Artificial Intelligent (AI) వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే?
Also Read: బిడ్డ జోలికి వచ్చిన అభిమాని పై కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొనే!
మహా గణపతి తల్లిదండ్రులతో కలిసి కైలాసంలో కొలువై ఉంటారని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలకు భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పేర్కొంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తాజాగా కొందరు ఏఐ వీడియోను తయారు చేశారు. గణనాథుడు కైలాసం నుంచి భూమిపైకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇందులో భాగంగా ఒక సూట్ కేస్ లో తనకు సంబంధించిన దుస్తులను సర్దుకుంటాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని భూలోకానికి బయలుదేరుతాడు. ఈ సందర్భంగా తల్లి పార్వతి వినాయకుడిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వినాయకుడిని భూలోకానికి సాగనంపుతారు. వినాయకుడు ఒక ఎగిరే కారులో భూమిపైకి వస్తాడు. అక్కడినుంచి సూట్ కేస్ తీసుకుని మండపాలకు చేరుకుంటాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఏ విషయమైనా ఏఐ వీడియో ద్వారా తెలుపుతూ ఆకట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి సంబంధించిన ఒక వీడియోను తయారుచేసి వీక్షకుల ప్రశంసలు పొందుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగలో మొదటి పూజ అందుకునే గణనాథుడికి ప్రతి ఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. పది రోజులపాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేస్తారు. ఈ సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలు, ఉండ్రాళ్ళు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా కలిసి కలిసి ఉంటారు. కుల, మత భేదం లేకుండా అందరూ ఒక చోటికి వచ్చి ఆటపాటలతో ఉల్లాసంగా ఉంటారు.
ఇలా పది రోజులపాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తర్వాత వినాయక నిగ్రహ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వినాయకుడు కైలాసానికి వెళ్తాడని కొందరు చెబుతారు. అయితే వినాయకుడు కేవలం నవరాత్రి ఉత్సవాలలోనే కాకుండా ప్రతి పూజలో ఆది పూజను అందుకుంటాడని.. ఈ దేవుడు ఎప్పుడూ భక్తులతోనే ఉంటాడని మరికొందరు చెబుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే వినాయకుడు ఎన్నో విఘ్నాలను తొలగిస్తాడు.