https://oktelugu.com/

Astrology : రాహువు, శని కలయిక.. ఈ మూడు రాశుల వారికి పండుగే..

శని, రాహువు కలయిక వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఈ రాశి వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్ లో లాభాలు తెస్తాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 23, 2024 / 01:19 PM IST

    Astrology

    Follow us on

    Astrology : రాహువు, కేతువు.. ఈ పేర్లు వింటే కొందరు భయపడిపోతుంటారు. జ్యతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి జీవితంలోకి వీరిల ఎవరు ప్రవేశించినా వారి జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోతుంది. నిత్యం మనశ్శాంతి ఉంటుంది. మరోవైపు శని ప్రభావం ఉన్న జీవితం సాఫీగా ఉండదు. కొన్ని పురాణాల ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. రాహువు, కేతువుల హవా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. వీరికి శని తోడుకావడంతో గ్రహాలపై ప్రభావం చూపుతాయి. అయితే ఎప్పటికీ అనిశ్చితి ఉంటుందని అనుకోలేం. రాహువు కేతువులు చెడు ప్రభావం చూపినా.. వారి అనుగ్రహం ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. వచ్చే ఏడాదిలో రాహువు, శని తోడవుతున్నారు. దీంతో కొందరి జీవితాల్లో వెలుగులు రానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    గత ఏడాది అక్టోబర్ లో మీన రాశిలోకి రాహువు ప్రవేశించాడు. ఆ తరువాత వచ్చే ఏడాది అంటే 2025 మే నెలలో కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే రాహువు రాశి మారడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కుంభ రాశికి శని అధిపతి. రాహువు, శని మంచి మిత్రులు. ఈ కారణంగా 3 రాశుల వారికి రాహు ప్రభావం ఉండదు. దీంతో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?

    రాహువు రాశి మార్చడం వల్ల మేష రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి అప్పటి నుంచి శుభ యోగం మొదలవుతుంది. వ్యాపారులు శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు అప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి కొన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అయితే కొత్త వ్యక్తులకు ఆప్పులు ఇవ్వడానికి ఆలోచించాలి. బ్యాంకు రుణం తీసుకుంటే అధిక వడ్డీ కట్టాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు అంతమంచిది కాదు.

    శని, రాహువు కలయిక వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఈ రాశి వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్ లో లాభాలు తెస్తాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. విహార యాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి.

    కన్యారాశి పై రాహు, శని ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. అనారోగ్యాల సమస్యల నుంచి బయటపడుతారు. జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి. అనుకోకుండా ధనం వస్తుంది. ఊహించని లాభాలు ఉంటాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.