https://oktelugu.com/

Astrology: ధనుస్సు రాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు..

రాశి చక్రంలో మొదటిదైన మేష రాశిపై సూర్యుడి ప్రవేశ ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉండనున్నాయి. వీరు అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2024 / 01:00 AM IST

    Astrology

    Follow us on

    Astrology: గ్రహాలకు అధిపతి సూర్యుడు. మిగతా గ్రహాలపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. అందువల్ల సూర్యుడు ఒక రాశిలో ఉంటే.. కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. 2024 ఏడాది చివరి రోజుల్లో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 15న సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశం చేసి కొన్ని రోజుల పాటు ఉంటాడు. దీంతో కొన్ని రాశులపై సూర్యడి రాక ప్రభావం ఉండనుంది. అవి ఏ రాశులో చూద్దాం..

    రాశి చక్రంలో మొదటిదైన మేష రాశిపై సూర్యుడి ప్రవేశ ప్రభావం ఉండనుంది. దీంతో ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉండనున్నాయి. వీరు అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. వ్యక్తిగతంగా ఏ పని చేపట్టినా ఆ పనులు సక్సెస్ అవుతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. డబ్బు సమస్య తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.

    సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశం చేయడం వల్ల సింహారాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. బంధువుల నుంచి డబ్బు సాయం అందుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెంటనే తిరిగి వస్తాయి.

    ధనుస్సు రాశిపై సూర్యుడి రాక ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారికి అనుకోకుండా ఆదాయం వస్తుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చూస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. లక్ష్మీకటాక్షంతో కొందరు వ్యాపారులు అపారమైన లాభాలు పొందుతారు. కొందరు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశిలో సూర్యుడి సంచార ప్రభావం ఉండనుంది. ఈ రాశి ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడుతారు. ఇన్నాళ్లు సమస్యలు ఉన్న ఇళ్లల్లో ఇప్పుడు సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఉండే ఆడవారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    మీన రాశిపై సూర్యుడి ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దంపతుల మధ్య ఉండే సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారం కోసం చేసే విహార యాత్రలు లాభిస్తాయి. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొత్తగా పెట్టుబుడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. వాహనాలపై ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.