Train Journey : భారతదేశంలోని రవాణా మార్గాల్లో రైలు మార్గం అతి పొడవైనది. అంతేకాకుండా ఇది దేశం మొత్తం దాదాపు కనెక్టివిటిని కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణం చేయడానికి చాల తక్కువ ధర ఉండడంతో ఎక్కువ శాతం ఇందులోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకునేవారు ఎలాంటి అలసట లేకుండా ఉండడానికి ట్రైన్ జర్నీ కోరుకుంటారు. అయితే రైలులో ప్రయాణం చేయాలంటే ఈ వ్యవస్థ గురించి తెలిసి ఉండాలి. ముఖ్యంగా రైల్వే బోర్డుకు సంబంధించిన నియమాలు, ఇతర సౌకర్యాల విషయంలో సూచనలు పాటించాలి. వీటిలో ట్రైన్ లో ఉపయోగించే కొన్ని సౌకర్యాల విషయంలో రూల్స్ కచ్చితంగా పాటించాలి. ఇందులో కరెంట్ వాడకం గురించి ముందే అవగాహన ఉండాలి. అదేంటంటే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అందరి వద్ద స్మార్ట్ మొబైల్ ఉంది. ఏ పని చేయాలన్నా మొబైల్ నే ప్రధానంగా నిలుస్తుంది. అయితే ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువగా మొబైల్ వాడకం పెరిగిపోవడంతో దీని ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ట్రైన్ లో జర్నీ చేసే సమయంలో కాలక్షేపానికి కొందరు, ఇతర అవసరాల మరికొందరు మొబైల్ ను యూజ్ చేస్తూంటారు. దీంతో అనుకున్న దాని కంటే ముందే మొబైల్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ట్రైన్ లో అందుబాటులో ఉన్న విద్యుత్ పోర్ట్ లో పెట్టి చార్జింగ్ పెట్టుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా నైట్ జర్నీ చేసేవాళ్లు రాత్రి మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే తప్పులో కాలేసినట్లే.
ట్రైన్ జర్నీ చేసే సమయంలో ప్రయాణికుల అవగాహన కోసం కొన్ని రైల్వే బోర్డు నిబంధనలు బోగీలపై రాస్తూ ఉంటాయి. ట్రైన్ లో ప్రయాణించేవారు ఎలాంటి విషయాలో జాగ్రత్తగా ఉండాలో? ఏం చేయాలో సూచిస్తూ ఉంటారు. వీటిలో ఫోన్ ఛార్జింగ్ కు సంబంధించిన ఒక సూచన ఉంటుంది. ‘రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవద్దు’ అని కనిపిస్తుంది. కానీ కొందరు దీనిని పట్టించుకోకుండా రాత్రి మొబైల్ ఛార్జింగ్ పెడుతారు. కానీ ఇలా చేస్తే ఫోన్ పేలిపోద్ది..
ఇంట్లో ఉన్న సమయంలో చాలా మంది మొబైల్ ను రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేస్తారు. కానీ రైలులో అలా చేయొద్దు. ఎందుకంటే విద్యుత్ తో ప్రయాణించే ట్రైన్ అత్యధిక వోల్టేజీతో కూడుకొని ఉంటుంది. ఈ సమయంలో ఒక్కోసారి తక్కువ.. ఒక్కోసారి ఎక్కువ ప్రవాహకం ఉంటుంది.అయితే రాత్రి సమయంలో ఇది మారే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల అత్యధిక విద్యుత్ సరఫరా అయి మొబైల్ చార్జింగ్ ద్వారా మొబైల్ కు వస్తుంది. దీనిని తట్టుకోలేని మొబైల్ ఒక్కోసారి హ్యాంగింగ్ కావొచ్చు. లేదా పేలిపోవచ్చు.
అయితే అత్యవసరం అయితే 10 నిమిషాలు లేదా 20 నిమిషాల వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేగానీ.. రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల మొబైల్ పేలిపోవచ్చు.. లేదా షార్ట్ షర్క్యూట్ తో ట్రైన్ లో మంటలు కూడా రావొచ్చు. అందువల్ల ఈ విషయం తెలిపేందుకు రైల్వే బోర్డు వారు బోగీలపై పైన సూచించిన విధంగా బోర్డు పెడుతారు. ఇక నుంచి ట్రైన్ జర్న చేసే సమమంలో రాత్రి సమయంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోకుండా ఉండండి.