Nizamabad : భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రకృతిని కూడా దైవంగా కొలిచే దేశం మనది. సైన్స్ అభివృద్ధి చెందరతున్నా.. ప్రకృతి శక్తులను ఇప్పటికీ నమ్ముతారు. అందుకు కారణం అనేక సాక్షాధారాలు ఉండడమే. తాజాగా ఇలాంటి ఓ రహస్య నిజాబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. సాక్షాత్తు వీరభద్రుడు కొలువైన ఆ గ్రామానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. అయ్యలగుట్ట రాజరాజేశ్వరస్వామి అయ్యలయ్య, అయ్యలస్వామిగా పిలుస్తారు. అక్కడ శివలింగానికి పూజలు చేయరు. వీరబ్రధుడిని పూజిస్తారు. మర్రిచెట్టు పైనుంచి కిందకు జారిన బండపై స్వామివారు వెలిశారని అయ్యల గుట్ట ప్రధాన అర్చకుడు తెలిపారు. స్వామివారికి గుడి కట్టవద్దని ఓ భక్తని కలలో చెప్పారట. అందుకే స్వామివారికి గుడి లేదు. ఏటా పుష్యమి అమావాస్యరోజున జాతర నిర్వహిస్తారు. అయ్యలు, సిద్ధులు, రుషులు అక్కడ తపస్సు చేయడం వలన అయ్యల గుట్టగా పేరు వచ్చిందట. ఇక జాతర సమయంలో గ్రామ అభివృద్ధిమిటీ ఆధ్వర్యంలో బెల్లం అన్నం నైవేద్యాలతో ఎడ్ల బండ్ల ఊరేగింపుతో స్వామివారిని నయన మనోహరంగా అలకరించి చిన్న చిన్న పల్లకిల్లో ఊరేగింపు తీస్తారు. గుట్ట చుట్టూ స్వామివారిని తిప్పి మర్రిచెట్టు గద్దెపై ఉంచి పూజలు చేస్తారు.
మూడు గంటలు వారు వస్తారని..
ఇక ఈ గుట్ట వద్దకు నిత్యం రాత్రి 12 నుంచి 3 గంటల వరకు సిద్ధులు, అయ్యలు, రుషులు వస్తారని ఇప్పటికీ నమ్ముతారు. మూడు గంటలపాటు తపస్తు చేసే శబ్దాలు వినిపిస్తాయని నాటి పూర్వీకులు చెబుతుండేవారు. భక్తుల కోరికలను తేర్చే దైవమై.. భక్తులపాలిట కొంగుబంగారంగా స్వామివారు నిలుస్తున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, సంతానం లేనివారికి, ఉద్యోగం కావాలనుకునేవారికి, వ్యవసాయంలో అభివృద్ధి జరగాలనుకునే వారి కోరికలు స్వామివారు తీరుస్తున్నారు.
వీరభద్రునికి పూజలు..
ఇక్కడ శివాలయంగా పిలుస్తున్నా… శివుడికి కాకుండా వీరభద్రునికి పూజలు చేస్తారు. ఇక ఏటా నిర్వహించే జాతరకు చుట్టుపక్కల గ్రామాలైన సుంకేట్, మోర్తాడ్, వేల్పూర్, జాగిర్యాల్, భీంగల్ తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. విదేశాలకు వెళ్లేవారు, వేరేచోట స్థిరపడ్డ వారైనా కచ్చితంగా అయ్యలగుట్ట జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ స్వామివారు ఎప్పుడైనా చీకట్లోనే ఉంటాడు. విద్యుత్ దీపాలు వెలిగిస్తే ఉయానికి అవి కాలిపోతాయి. అందుకే అక్కడ స్వామి ప్రత్యకంగా ఉన్నారని నమ్ముతారు. స్వామివారు సహజమైన వెలుతురులో మాత్రమే ఉంటారని పూర్వీకులు తెలిపారు. గుడి లేకపోగా, విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇక అయ్య గుట్టపై ఉన్న బండను గతంలో దుండగులు పగులగొట్టారు. కానవీ వారం రోజుల్లో తిరిగి యథా స్థితికి వచ్చింది. అందుకే అక్కడ స్వామివారు నిజంగా ఉన్నారని నమ్ముతారు.