Sri Ram Navami : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహించడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు రామాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాంగం ప్రకారం వేద శాస్త్రం ప్రకారం చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ రోజున శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉంటారు. విశ్వా వసు సంవత్సరం ప్రకారం ఏప్రిల్ 6న శ్రీరామనవమి నిర్వహించాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననంతో పాటు కళ్యాణం, పట్టాభిషేకం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఎన్నో అదృష్టాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : ఈ నెలలో ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు..
శ్రీరామనవమి అంటే రాముడు, సీతకు కళ్యాణం. ఈ వేడుకలో దాదాపు హిందువులంతా పాల్గొంటారు. అయితే కొందరు ఇంట్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి దగ్గర్లోని రామాలయం లేదా వైష్ణవాలయం సందర్శిస్తారు. ఈ వేడుకలో పాల్గొన్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అయితే ఆలయానికి వెళ్లే ముందు ఇంట్లో కొన్ని కార్యక్రమాలు చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు.
శ్రీరామనవమి వేడుకలో పాల్గొనే ముందు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కచ్చితంగా కట్టాలని అంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం లో అనేక మార్పులు ఉంటాయి. దీంతో గాలిలో అనేక క్రమంలో సంచరిస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా అడ్డుకున్న వారవుతారు. అంతేకాకుండా శ్రీరామనవమి రోజున ఇలా చేయడం వల్ల ఇంటికి శుభాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని తెలుపుతారు. అందువల్ల గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మర్చిపోవద్దని అంటారు.
శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన తర్వాత పసుపు వస్త్రాలను ధరించడం మంచిది అని అంటున్నారు. పసుపు వస్త్రాలు ధరించడం వల్ల శుభం కలుగుతుంది. అంతేకాకుండా భక్తి భావం పెరిగిపోయి రాముడి ధ్యానంలో ఉండిపోతారు. ఇలా ఉండడంవల్ల వారి మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా దైవ చింతన పెరుగుతుందని అంటున్నారు.
శ్రీరామనవమి రోజు ఇంట్లో పీఠం ఏర్పాటు చేసి పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని అంటున్నారు. బియ్యం పిండితో ఒక ముగ్గురు ఏర్పాటు చేసి.. అందులో నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి వాటిపై సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను ఉంచాలి. ఆ తర్వాత సోడాపచార్లు అనుసరిస్తూ పూజ చేయాలి. అమ్మవారికి పూలను సమర్పించి ధూప దీప నైవేద్యాలు అందించాలి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి హారతి ఇవ్వాలి.
శ్రీరామనవమి పూజ చేసే సమయంలో శ్రీరామ తారక మంత్రం అయినా’ ఓం శ్రీ రామాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. అంతేకాకుండా ఈరోజు ఇంట్లో పండ్లు, పానకం వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను తయారు చేసుకోవాలి. వీటిని స్వామివారికి నైవేద్యంగా అందించిన తర్వాత ఇంటిలిపాది తీసుకోవాలి. వీటివల్ల ఏడాది పాటు ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు.
Also Read : ‘విశ్వావసు’ పంచాంగం ప్రకారం కొత్త పండుగలు ఇవే.