Sravana Masam 2024: ప్రతీ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు ఉంటాయి. అదే తెలుగు క్యాలెండర్ నుంచి 12 మాసాలు ఉంటాయి. కొన్ని పూజలు, వ్రతాలు, కార్యక్రమాలు చేసుకునే ముందు తెలుగు క్యాలెండర్ ను ఫాలో అవుతూ ఉంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఛైత్ర మాసం నుంచి ప్రారంభమై పాల్గుణ మాసం వరకు మొత్తం 12 మాసాలు ఉంటాయి. వీటిలో ఆషాఢ మాసం తరువాత వచ్చేది శ్రావణ మాసం. తెలుగు నెలలన్నింటిలో శ్రావణ మాసం ప్రత్యేకమైనది. ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు. దీనిని శూన్య మాసంగా పేర్కొంటారు. కానీ శ్రావణ మాసం నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఇలా పాల్గుణ మాసం వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతోంది. మరో రోజు గడిస్తే శ్రావణమాసంలోకి ఎంట్రీ ఇస్తాం. కొన్ని శుభకార్యాలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు చేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా కార్యక్రమాలతో పాటు శ్రావణంలో పెళ్లిళ్లు కూడా అధికంగా నిర్వహిస్తారు. ఇప్పటికే పెళ్లిళ్లకు సిద్ధమైన వారు శ్రావణ మాసంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే శ్రావణ మాసం శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనువైన మాసం అయినా.. అన్ని రోజులు అనుకూలంగా ఉండవు. వీటిలో కొన్ని రోజులు మాత్రమే మంచివిగా ఉంటాయి. ఆ రోజుల్లోనే శుభకార్యాలు నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు కొన్ని తేదీలు మాత్రమే మంచి ముహూర్తాలుగా ఉంటాయి. మరి ఆ మంచి ముహూర్తాలు ఏవి? ఎప్పుడెప్పుడు వస్తున్నాయి?
శ్రావణ మాసం ప్రారంభంతోనే పండుగల సీజన ప్రారంభం అవుతుంది. ఈ నెలలో ముందగా వచ్చే పండుగా నాగుల పంచమి. ఆ తరువాత రాఖీ.. ఇలా ఉగాది వరకు పండుగలు కొనసాగుతాయి. దాదాపు 6 నెలల పాలు శుభకార్యాలు నిర్వహించుకోడానికి అనువైన మాసాలుగా ఉంటాయి. 2024 ఏడాదిలో ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీన నాగుల పంచమితో పండుగలు ప్రారంభం అవుతున్నాయి. ఈనెలలో శుభముహూర్తాల విషయంలో కొందరు పండితులు ప్రత్యేక తేదీలను ప్రకటించారు.
ఈసారి శ్రావణ మాసంలో 12 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నట్లు కొందరు పండితులు తెలిపారు. వీటిలో ఆగస్టు 8,9,10, 11,15,17, 18, 22,23, 24, 28,30 తేదీలు ఉన్నాయి. ఈ తేదీల్లో పెళ్లిళలతో పాటు ఇతర శుభకార్యక్రామాలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అంటే గృహ ప్రవేశం, శంకుస్థాపనలు చేసుకోవచ్చని చెప్పారు. శ్రావణ మాసంలో వరలక్ష్మ వ్రతం, రాఖీ పౌర్ణమి పండుగలు కూడా రాబోతున్నాయి. వరలక్ష్మీ వ్రతం 16, రాఖీ పౌర్ణమి 19న నిర్వహించుకోనున్నారు.
శ్రావణమాసం సందర్భంగా శుభకార్యాలు నిర్వహించుకోడానికి అనువుగా ఉండడంతో ఈ నెల పాటు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. పెళ్లిళ్లు జరిగితే ఈ కార్యక్రమానికి సంబంధించి దుస్తుల వ్యాపారం, బ్యాండ్ మేళం, ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడనున్నాయి. మార్కెట్లో షాపులన్నీ జనంతో నిండనున్నాయి. రాఖీ పౌర్ణమిం సందర్భంగా మార్కెట్లో మొత్తం రాఖీలతో నిండిపోనుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజా దుకాణాలు కళకళలాడనున్నాయి. దేవాలయాల్లో భక్తులతో రద్దీ ఉంటాయి. ప్రత్యేక పూలజు, వ్రతాలతో ఆలయాల్లో సందడి నెలకొననుంది. వ్యాపారులు సైతం కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతారు. కొందరు తీర్థయాత్రకు వెళ్లేందుకు రెడీ అవుతారు. ఈ కారణంగా ట్రావెల్ బిజినెస్ కూడా ఊపందుకోనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన శ్రావణమాసం సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత భాద్రపద మాసం ప్రారంభమవుతంది. ఈనెలలో వినాయకచవితి రానుంది. ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న నిర్వహించుకోనున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More