Rashi Phalalu: తుల రాశివారికి విశేష ఫలితాలు.. నేడు మిగతా రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

పిల్లపై కోపం తెచ్చుకుంటారు. పెండింగు పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెడితే లాభాలు రావచ్చు.

Written By: Srinivas, Updated On : November 9, 2023 9:34 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 9న గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో తులా రాశివారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
పిల్లపై కోపం తెచ్చుకుంటారు. పెండింగు పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెడితే లాభాలు రావచ్చు.

వృషభం:
కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడుతాయి. పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. బాధ్యతలు నెరవేర్చడంపై దృష్టి పెడుతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:
ఈరోజు మొత్తం ప్రశాంతంగా జీవిస్తారు. తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుం సభ్యలతో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటకం:
ఇతరులకు సాయం చేసేటప్పుడు ముందు, వెనకా ఆలోచించాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో సక్సెస్ సాధిస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీల్లో పాల్గొంటే సక్సెస్ అవుతారు.

సింహం:
ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం క్షీణిస్తుంది. వ్యాపారం చేయాలనుకునేవారికి అనుకూలం. వివాహితులకు మంచి అవకాశాలు వస్తాయి.

కన్య:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు. ఓ సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు.

తుల:
ఈరాశి వారికి అనుకూల ఫలితాలు. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. కొందరికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు.

వృశ్చికం:
పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల సలహాలు తీసుకోకపోవడమే మంచిది. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం. పిల్లల వైపు నుంచి కొన్ని సానుకూల వార్తలు వింటారు.

ధనస్సు:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు ఏ పిన చేసిన విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి బహుతులు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మకరం:
రుణాలు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. మహిళా అధికారి నుంచి మద్దతు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుంభం:
కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. అన్ని పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది. కానీ అనుకూల ఫలితాలే ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

మీనం:
కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. తండ్రి సహాయంతో ఎటువంటి సమస్యనైనా పరిస్కరించుకోగలుగుతారు.