https://oktelugu.com/

Guru Purnima : గురు పౌర్ణమి వేళ.. ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు.. వీరికి వద్దన్నా డబ్బు..

గురు పౌర్ణమి కారణంగా ఇంతకాలం సమస్యలతో బాధపడేవారు కొన్ని పరిహారాల వల్ల వాటి నుంచి బయటపడొచ్చు. ఈరోజు తాము గురువుగా భావించే వ్యక్తులను ఇంట్లోకి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా పూజ చేయాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2024 / 11:34 AM IST
    Follow us on

    Guru Purnima : హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పర్వదినాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే కొన్ని ప్రత్యేక రోజుల వల్ల కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. ఆషాఢమాసంలో వచ్చే గురుపౌర్ణమి కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా రాశుల వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకోన్నాయి. ఈ ఏడాది గురుపౌర్ణమి రోజు ప్రత్యేకత చాటుకుంది. ఈ సమయంలో కర్కాటక రాశిపై సూర్యుడు, శుక్రుడు, బుధుడు సంచరిస్తారు. ఒకే రాశిపై మూడు గ్రహాలు ఉండనున్నాయి. అలాగే వృషభ రాశిలో గురుడు, కుజుడు సంచరిస్తారు. ఈ రాశుల కలయిక వల్ల కొన్ని రాశుల్లో మార్పులు రానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుపౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రంలో తెల్లవారు జాము ప్రారంభమవుతుంది. ఇదే రోజు ప్రీతియోగం ఏర్పడనుంది. సాయంత్రం అమృత యోగం ఉండనుంది. దీంతో 12 రాశుల్లోని కొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. ఈ ప్రభావంతో కొందరి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు వారి జీవితాల్లో చూడని సంఘటను చూడనున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండనున్నారు. మరోవైపు అనుకోని ధనం వచ్చి చేరుతుంది. అయితే కొన్ని రాశుల వారు తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. దీంతో సమస్యలున్న వారి జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. మరికొన్ని రాశుల వారు తమ వాదనలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే శత్రువులు పెరిగి జీవితం అల్ల కల్లోలంగా మారుతుంది. అయితే ఏ యే రాశుల్లో ఎలాంటి మార్పులు ఉండనున్నయో చూద్దాం..

    గురు పౌర్ణమి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోనున్నాయి. ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాటుంటుంది. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు కొంతకాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీంతో వారికి అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికి ప్రత్యేకంగా బహుమతిని కనుగోలు చేస్తారు.

    సింహా రాశి వారికి అద్భుత ప్రయోజనాలు జరగనున్నాయి. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. గతంలో పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండాలి. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. వారితో ఉల్లాసంగా గడుపుతారు.

    గురు పౌర్ణమి ప్రభావం కుంభ రాశిపై పడనుంది. ఈ సందర్భంగా ఈ రాశి వారు ఏ పని చేపట్టినా అవి సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకోని లాభాలు ఉంటాయి. అనుకోకుండా ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతంది. పెండింగులో ఉన్న సమస్యలు పూర్తవుతాయి. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా ఉంటారు. కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రేమగా మెదులుతారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

    గురు పౌర్ణమి కారణంగా ఇంతకాలం సమస్యలతో బాధపడేవారు కొన్ని పరిహారాల వల్ల వాటి నుంచి బయటపడొచ్చు. ఈరోజు తాము గురువుగా భావించే వ్యక్తులను ఇంట్లోకి ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా పూజ చేయాలి. వారికి అతిథి మర్యాదలు చేసి సపర్యలు చేయాలి. దీంతో అప్పటి వరకు జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంది.