Shukra Moudyami 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు, వ్రతాలు చేయడం వల్ల దైవానుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు. ఇదే సమయంలో కొన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించిన అశుభం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏడాదిలో కొన్ని రోజులపాటు మౌఢ్యం ఉంటుంది. ఆయా రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించోద్దని.. అలా చేస్తే ప్రతికూలమైన వాతావరణాన్ని ఈ ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. 2025 ఏడాదిలో జూన్ 12 నుంచి జూలై 9 వరకు మౌఢ్యం రోజులు వచ్చాయి. ఇప్పుడు నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకు మౌఢ్యం రోజులు ఉండలు ఉన్నాయి. అంటే దాదాపు 83 రోజులపాటు కొనసాగలు ఉన్నాయి. ఈరోజుల్లో ఎలాంటి వివాహాలు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవద్దని అంటున్నారు. అసలు ఎందుకు ఈ మౌఢ్యం రోజులు? ఇలా ఎందుకు ఏర్పడతాయి?
గ్రహాల ప్రభావంతోనే జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. గ్రహాలన్నీ దాదాపు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు గ్రహాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. దీంతో జాతకం ప్రకారం ఆయా గ్రహాల బలం ఎక్కువగా ఉండడంతో మనుషులకు అనుకూలంగా మారి కొన్ని పనులు చేయగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో గ్రహాలు సూర్యునికి దగ్గరగా చేరుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గ్రహాల శక్తి నశిస్తుంది. ఫలితంగా మనుషులకు కొన్ని పనులు జరిగే అవకాశం ఉండదు. 2025 నవంబర్ 26 నుంచి శుభకార్యాలకు అణువుగా ఉండే గురుడు, శుక్రుడు గ్రహాలు సూర్యుడికి అతి సమీపంలో చేరనున్నాయి. ఇలా చేరడంతో వీటి శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల శక్తి తగ్గిపోవడంతో శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. అందుకే ఈ పరిస్థితిని moudyam అని అంటారు. ఇలా వచ్చినప్పుడు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
సాధారణంగా ఒక వివాహం జరిపించాలని అనుకున్న వారికి గురు బలం ఎక్కువగా ఉండాలని అంటారు. అలాగే శుభకార్యాలను నిర్వహించడానికి కూడా గురుబలం చూస్తూ ఉంటారు. సంపదకు, సంతోషాలకు అనుకూలంగా ఉండే శుక్రుడు కూడా అనుకూలంగా ఉంటేనే జీవితంలో అన్నీ అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ రోడ్డు గ్రహాలు ప్రతికూల వాతావరణంలో ఉంటే ఏ పని పూర్తికాకుండా ఉంటుంది. ఈ రెండు గ్రహాలు శక్తిని తగ్గించుకున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పండితులు చెబుతుంటారు. అందువల్ల మౌడ్యం రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ 83 రోజులపాటు వివాహాలు, గృహప్రవేశాలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నవారు, కొత్త ఇంటి నిర్మాణం చేపట్టేవారు, బోర్ చేయాలని అనుకున్న వారు, పుట్టు వెంట్రుకలు తీయాలని అనుకున్నవారు.. కొన్ని రోజులపాటు వెయిట్ చేయడం మంచిదని అంటున్నారు.
ఫిబ్రవరి 7 తర్వాత జాతకం ప్రకారం శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలుపుతున్నారు. అయితే ఈ మౌఢ్యం రోజుల్లో సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. అయితే వారి జాతకం ప్రకారం సమీప పండితులను సంప్రదించి సరైన రోజుల్లో నిర్వహించుకోవాలని అంటున్నారు.