LIK Movie Story: ప్రస్తుతం తమిళనాడు యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) మాత్రమే. దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించిన ప్రదీప్, ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమా తో హీరో గా మారి, భారీ బ్లాక్ బసుతీ హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు కూడా. ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన ‘డ్రాగన్’ చిత్రం ‘లవ్ టుడే’ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత రీసెంట్ గ విడుదలైన ‘డ్యూడ్’ చిత్రం భారీ హిట్ అయితే అవ్వలేదు కానీ , ప్రదీప్ కెరీర్ లో మూడవ వంద కోట్ల గ్రాస్ సినిమాగా మాత్రం నిల్చింది. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రం తర్వాత ఆయన నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శత్వం లో ‘LIK’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ‘ధీమా..ధీమా’ లిరికల్ వీడియో సాంగ్ కి యూత్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ మరోసారి భారీ హిట్ ని అందుకోబోతున్నాడని ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ అనిపించింది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఇది కేవలం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మాత్రమే అని అనుకుంటే పెద్ద పొరపాటే. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది సైన్స్ ఫిక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ అట. ఈమధ్య కాలం లో ఇలాంటి విభిన్నమైన అంశం తో ఒక్క సినిమా కూడా రాలేదు. లవ్ స్టోరీ కి సైన్స్ ఫిక్షన్ జోడించాలి అనే ఆలోచనే అద్భుతం.
హీరో ఇందులో భవిష్యత్తులోకి వెళ్తాడు, అంటే 2040 వ సంవత్సరం లోకి వెళ్తాడు అన్నమాట. ఆ కాలం లో ట్రెండ్ ఎలా మారింది, అప్పటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య తేడా ని చూపిస్తూ డైరెక్టర్ తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని టాక్. గతం లో తేజ సజ్జ ‘అద్భుతం’ అనే చిత్రం చేసాడు. ఇంచు మించుగా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చినదే. కానీ ‘LIK’ మాత్రం చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుందట. పాటలు కూడా చాలా చక్కగా కుదిరాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు అదరగొట్టేసాడట. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.