Shaiva Tradition
Shaiva tradition: హిందూ మతంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రస్తుతం మహా కుంభమేళా (Maha Kumbh Mela) జరుగుతోంది. ఎంతో ఘనంగా దీన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా (Kumbh Mela) ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఎందరో కోట్లాను మంది భక్తులు ఇప్పటికే ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తే పుణ్యం ఫలం అందుతుంది. కేవలం భక్తులు మాత్రమే కాకుండా ఎందరో సాధువులు, అఘోరీలు కూడా పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో చాలా మంది సాధువులు, శివుని భక్తులు చూసే ఉంటారు. వీరు ఎక్కువగా పరమ శివున్ని నమ్ముతారు. వీరినే శైవ సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయాన్ని అనుసరించే వారిని శైవ అని పిలుస్తుంటారు. అయితే ఈ శైవ మతం గురించి ఎప్పుడు వినడమే కానీ ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. ఈ శైవ మతం గురించి వేదాలు, ఉపనిషత్తుల వంటి మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అయితే శైవ మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయి. ఈ శైవ మతానికి చెందిన సన్యాసి వారి ఆచారాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
శైవ మతంలో ఎన్ని శాఖలు ఉన్నాయంటే?
శైవ మతంలో మొత్తం ఐదు శాఖలు ఉన్నాయి. పాశుపత్ శైవిజం, కాశ్మీర్ శైవిజం, వీర్ శైవిజం, సిద్ధ సిద్ధాంతం, శివ అద్వైతం ఉన్నాయి. అయితే ఈ శైవ శాఖలన్నీ కూడా ఏకేశ్వరోపాసన ఉన్నవే. వీరు పరమశివుని ఎంతో భక్తితో కొలుస్తారు. అయితే వీరు ఎక్కువగా శివుడు శివలింగ రూపంలో ఉన్న ఆలయాన్ని దర్శిస్తారు.
శైవ శాఖకు చెందిన సన్యాసి ఆచారాలు
శైవ శాఖలోని సాధువులు శివునికి తప్ప మరెవ్వరికీ కూడా పరమేశ్వరుని హోదా ఇవ్వరు. శివుడు ఎలా ఉంటారో వీరు కూడా అలానే ఉంటారు. అంటే శివుని జుట్టులా వారు కూడా పెట్టుకుంటారు. కొందరు జడలను వాల్చితే మరికొందరు వాల్చరు. అయితే ఈ శివుని భక్తుని సాధువులు ఆచారాలను కేవలం రాత్రిపూట మాత్రమే చేస్తారు. కొందరు ఈ సాధువులలో నగ్నంగా ఉంటే.. మరికొందరు కుంకుమపువ్వు ధరించి, కమండ, పటకారు, త్రిశూలం మొదలైన వాటిని చేతిలో పట్టుకుంటారు. ఒళ్లంతా బూడిద ధరిస్తారు. వీరిలో నాథ్, అఘోరి, అవధూత్, బాబా, ఔఘద్, యోగి, సిద్ధ ఇలా రకరకాలుగా కూడా ఉంటారు. అయితే నాగ సాధువులతో పాటు అఘోరాలు కూడా శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ శైవ మతానికి సొంత గ్రంథాలు కూడా ఉన్నాయి. శ్వేతాశ్వర ఉపనిషత్, శివ పురాణం, ఆగమ్ గ్రంథ్, తిరుమురై ఉన్నాయి. శైవ భక్తులు ఎక్కువగా కేదార్‌నాథ్, సోమనాథ్, రామేశ్వరం, చిదంబరం, అమర్‌నాథ్, కైలాష్ మానసరోవర్ వంటి తీర్థయాత్రలకు వెళ్తుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.