https://oktelugu.com/

Queen: ప్రపంచంలో అందమైన మహిళలో ఈమె ఒకరు.. ఎంతమంది ఈమె కోసం చనిపోయారంటే?

పూర్వం రోజుల్లో రాణులను(Queen) పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు స్వయం వరానికి వెళ్లేవారు. ఇలా వెళ్తే వారి శక్తి సామర్థ్యాలను బట్టి రాణులు ఇష్టపడేవారు. అయితే పూర్వం రాణుల కంటే రాజులు మాత్రం ఎన్నో పెళ్లిళ్లు(Marriage) చేసుకునేవారు. రాణులు ఎంతో అందంగా ఉంటారని, వారి కోసం కొందరు ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ అమ్మాయిలు కోసం కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2025 / 11:39 PM IST

    princes

    Follow us on

    Queen:పూర్వం రోజుల్లో రాణులను(Queen) పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు స్వయం వరానికి వెళ్లేవారు. ఇలా వెళ్తే వారి శక్తి సామర్థ్యాలను బట్టి రాణులు ఇష్టపడేవారు. అయితే పూర్వం రాణుల కంటే రాజులు మాత్రం ఎన్నో పెళ్లిళ్లు(Marriage) చేసుకునేవారు. రాణులు ఎంతో అందంగా ఉంటారని, వారి కోసం కొందరు ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ అమ్మాయిలు కోసం కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ పూర్వం రోజుల్లోనే ఓ రాణి కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పూర్వం రోజుల్లో ఒక్కోరు ఒక్కో పద్ధతిలో స్వయం వరం నిర్వహించేవారు. కొందరు స్వయం వరానికి వెళ్లినప్పుడు రాణి మెడలో పూల మాల వేయాలి. ఎవరైతే స్వయం వరంలో విజేతగా నిలుస్తారో వారికి రాణిని ఇచ్చి వివాహం చేస్తారు. ఒకవేళ ఓడిపోతే వారు రాణిని పెళ్లిచేసుకోకూడదు. తిరిగి వారి రాజ్యానికి వెళ్లిపోవాలి. అయితే 19వ శతాబ్దంలో మిస్ వరల్డ్‌గా(Mis World) పిలిచే ఓ అందమైన రాణి కోసం ఒక 145 మంది స్వయం వరానికి వెళ్లారు. వీరిలో ఓ 13 మంది వివాహం చేసుకోవడానికి విఫలం కావడంతో.. 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ ఎవరూ ఆ రాణి? ఈమె గురించి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    పెర్షియన్ యువరాణి అయిన జహ్రా ఖనుమ్ తాజ్ ఎస్-సల్తానే కోసం 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్వయం వరానికి వెళ్లి విఫలం కావడంతో అంతటి అందమైన రాణిని వివాహం చేసుకోలేకపోయారని ఆత్మహత్య చేసుకున్నారు. కజర్ రాజవంశంలో నాల్గవ సుల్తాన్ నాసిర్-అల్-దిన్ షా కజర్ కుమార్తె జహ్రా ఖనుమ్ తాజ్ ఎస్-సల్తానే. ఈమె 1883లో టెహ్రాన్‌లో జన్మించింది. చూడటానికి ఒత్తు కనుబొమ్మలతో అందంగా ఉంటుందని అంటారు. అయితే ఈ రోజుల్లో అందం అంటే ముఖం, రంగు అన్ని చూసేవారు. కానీ ఆ రోజుల్లో అందం అంటే మనస్సు, తెలివి, శక్తి అనే నమ్మేవారు. అయితే ఈ సమయంలో పర్షియాలో అత్యంత విద్యావంతురాలితో పాటు అందమైన యువరాణి అని చెప్పుకుంటారు. సుల్తాన్ నాసిర్-అల్-దిన్ షాకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. జహ్రా ఖానుమ్ తాజ్ ఎస్-సల్తానే మూడవది. ఆమెకు కళలంటే చాలా ఇష్టం. చిత్రకారుడు, రచయిత, మహిళల హక్కుల కోసం ఆమె పోరాడారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి 145 మంది వెళ్లిన ఎవరిని పెళ్లి చేసుకోలేదు. చివరకు ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

    జహ్రా ఖానుమ్ తాజ్ ఎస్-సల్తానే కోర్టులో హిజాబ్‌కు బదులుగా పాశ్చాత్య దుస్తులు ధరించడానికి బలమైన చర్యలు తీసుకుంది. అలాగే ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం ఓ సంస్థను కూడా ప్రారంభించింది. జహ్రా తన చివరి శ్వాస వరకు మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. చివరకు ఆమె 1936లో మరణించింది. స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకులలో ఒకరిగా ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటారు. బయట ప్రపంచానికి కొందరి కళ్లకు ఈమె అందంగా కనిపించకపోవచ్చు. కానీ ఆమె మనస్సు చాలా విశాలమైనది.