https://oktelugu.com/

Vemulawada: స్వామివారికి ఈ సారి అధిక ఆదాయం.. ఎక్కడంటే..

Vemulawada: కోరిక కోర్కెలు తీర్చే దేవుడిగా వేములవాడ రాజన్నకు గొప్ప పేరుంది. తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చే ఆదాయం కాకున్నా బాగానే భక్తులు ముట్టచెప్పుతారు. ప్రధానంగా ఇక్కడ జోగినీలు ప్రతి శివరాత్రికి అద్భుతంగా వేడుకను చేస్తారు. జోగినీల శివరాత్రి యోగం..

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 11, 2024 4:01 pm
    Vemulawada Rajarajeshwara Swamy Temple

    Vemulawada Rajarajeshwara Swamy Temple

    Follow us on

    Vemulawada: తెలుగు రాష్ట్రాల్లో కలియుగ వైకుంఠ దైవంగా తిరుమలను కొలుస్తారు. ఆ దేవ దేవుడి తర్వాతనే మిగతా ఆలయాలకు గుర్తింపు ఉంటుంది. ఇక ప్రముఖ శివాలయాలు చూస్తే ఏపీలో శ్రీశైలం.. తెలంగాణలో వేములవాడ రాజరాజశ్వర స్వామికి గుర్తింపు ఉంటుంది.

    కోరిక కోర్కెలు తీర్చే దేవుడిగా వేములవాడ రాజన్నకు గొప్ప పేరుంది. తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చే ఆదాయం కాకున్నా బాగానే భక్తులు ముట్టచెప్పుతారు. ప్రధానంగా ఇక్కడ జోగినీలు ప్రతి శివరాత్రికి అద్భుతంగా వేడుకను చేస్తారు. జోగినీల శివరాత్రి యోగం.. శివుడిని ఐక్యం చేసుకునే విధానం చాలా హైలెట్ గా ఉంటుంది.

    వేములవాడలో స్వయంభుగా రాజరాజేశ్వర స్వామి వెలిచాడని ప్రతీతి. ఇక్కడ ఒక ముస్లిం దర్గా కూడా ఆలయంలో ఉండడం చాలా ప్రత్యేకతగా చెప్పొచ్చు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి సంస్కృతి సంప్రదాయం లేదు. కేవలం వేములవాడలోనే ముస్లిం దర్గా ఆలయంలో ఉండడం విశేషంగా చెప్పొచ్చు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఆలయ కల్యాణకట్టలో తల నీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి.. ఆ పరమశివున్ని దర్శనం చేసుకుంటారు. అందుకే ఇది ముస్లిం భక్తులకు ప్రీతికర ఆలయంగా మారింది.

    వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిదిలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపు 38రోజులకు చేశామని ఇంచార్జి ఈవో కె.వినోద్ రెడ్డి తెలిపారు. ఇంతకీ హుండీ వివరాలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. ఆ కోరికలు తీర్చే శివయ్య ఆదాయం గురించి తెలుసుకోవడం ఎవరికి అయినా ఆసక్తే ఉంటుంది కదా. అందుకే ఆ వివరాలు మీ కోసం..

    38 రోజులకు గాను ఆలయానికి 1కోటి 88లక్షల,69వేల 697రూపాయల ఆదాయం వచ్చిందట. స్వామివారికి భక్తజనం కానుకల రూపంలో బంగారం 360గ్రాముల 100మిల్లిగ్రాములు, వెండి 14కిలోలు, 150గ్రాములు వచ్చాయి అని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అయితే లెక్కింపు కార్యక్రమానికి ముందుగా ఆలయ ఉన్నతాధికారులు, ఎస్పిఎఫ్, పోలీస్ సిబ్బంది, సీసీ కెమెరాల పర్యవేక్షణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ తర్వాత హుండీ లెక్కింపు నిర్వహించారు.గతం కంటే స్వామి వారి ఆదాయం చాలా వరకు పెరిగిందట.

    హుండీ లెక్కింపులో పాల్గొన్న వారికి స్వామి వారి దర్శన భాగ్యం, తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ సిబ్బంది. ఇందులో పాల్గొన్న భక్తులు స్వయంగా స్వామి వారకే సేవలు చేసినట్టుగా భావిస్తున్నారట. అయితే స్వామి వారి హుండీ లెక్కింపులో ఏసి కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఈవో వినోద్ రెడ్డిల పర్యవేక్షణలో ఉద్యోగులు పాటుగా శ్రీలలిత సేవాసమితి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్వామి వారికి కోడెల మొక్కు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందట.

    కోడెమొక్కుల క్యూలైన్‌లో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించి మీరీ..స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఇదిలా ఉంటే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఆదాయం కూడా అదే రేంజ్ లో గణనీయంగా పెరుగుతోంది. కోడె మొక్కుల ఆదాయంతో సమానంగా ప్రసాద విక్రయాల ద్వారా కూడా ఆదాయం వస్తుందట. అయితే ప్రసాదాల ద్వారా ఆదాయం మరింత పెరిగే అవకాశం కూడా ఉందట. మీరు ఒకసారి అయినా ఆ పరమశివున్ని దర్శనం చేసుకోకపోతే వీలు చూసుకొని వెళ్లి రండి. కోరిన కోరికెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు ఆ వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి.