https://oktelugu.com/

Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పాక్ ఏం ప్లాన్ చేస్తుందో?

Champions Trophy: పాకిస్తాన్ జట్టుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ దేశంలో నిర్వహించే ఛాంపియన్ ట్రోఫీలో తమ దేశ ఆటగాళ్లు ఆడబోరని స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ప్రకటించింది.. మ్యాచ్ వేదికలు మార్చితేనే తమ ఆటగాళ్లు చాంపియన్స్ ట్రోఫీలో ఆడతారని స్పష్టం చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 11, 2024 / 04:27 PM IST

    BCCI does not allow India to travel Pakistan

    Follow us on

    Champions Trophy: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ టోర్నీ నిర్వహించాలని పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. మైదానాలపై ఏపుగా పెరిగిన గడ్డిని కూలీలతో కత్తిరిస్తోంది. ఆటగాళ్లకు సెకండ్ హ్యాండ్ పరుపులు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది.. ఐసీసీకి ఫైనల్ డ్రాఫ్ట్ కూడా అందజేసింది. ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పాకిస్తాన్ జట్టుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ దేశంలో నిర్వహించే ఛాంపియన్ ట్రోఫీలో తమ దేశ ఆటగాళ్లు ఆడబోరని స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని ప్రకటించింది.. మ్యాచ్ వేదికలు మార్చితేనే తమ ఆటగాళ్లు చాంపియన్స్ ట్రోఫీలో ఆడతారని స్పష్టం చేసింది.

    వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి నెలలో నిర్వహించే ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు అందజేసింది.. ఈ షెడ్యూల్ కు బీసీసీఐ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇదే కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థల పెదనాన్న ప్రకారం గత ఆసియా కప్ జరిగినట్లే.. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీ ఎదుట ఉంచినట్టు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లను ఇతర ప్రాంతాలలో నిర్వహించాలని.. మిగతా మ్యాచులు మొత్తం పాకిస్తాన్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీ ని కోరినట్టు సమాచారం.. పాకిస్తాన్ దేశానికి తమ జట్టును పంపించబోమని, తమ జట్టు ఆడే మ్యాచ్ ల వేదికలను మార్చాలని బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

    ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ ను రూపొందించిన పాకిస్తాన్.. భారత జట్టు ఆడే మ్యాచ్ లకు లాహోర్ స్టేడియాన్ని కేటాయించింది. టీమిండియా ఆడే మ్యాచ్లు మొత్తం అక్కడే జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే భద్రతాపరమైన సమస్యలు నెలకొనే నేపథ్యంలో.. అసలు పాకిస్తాన్ దేశానికే తమ జట్టు వెళ్లకూడదని నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే హైబ్రిడ్ మోడ్ ను తెరపైకి తెచ్చింది. ఒకవేళ దానికి ఐసీసీ కనుక ఓకే చెబితే భారత్ ఆడే మ్యాచ్ లు మొత్తం శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఛాంపియన్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి..” భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంలో టీమిండియా ఆటగాళ్లను ఆడించడం బీసీసీఐకి ఇష్టం లేదు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఐసీసీ ముందు ధైర్యంగా చెప్పిందని” స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

    “ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే పాకిస్తాన్ దేశంలో భారత్ పర్యటించడం కష్టమే. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం కనుక భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఒప్పుకోకపోతే అప్పుడు తెరపైకి హైబ్రిడ్ విధానం వస్తుంది. దానివల్ల టీమిండియా శ్రీలంక లేదా దుబాయ్ వేదికలపై తన మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ప్రపంచ క్రికెట్ కు భారత్ మూలాధారం కాబట్టి ఐసీసీ కూడా బీసీసీఐ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాన్ని ఐసీసీ తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేమని” బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఇక 2013లో ధోని నాయకత్వంలో భారత్ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఇటీవల రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. ప్రస్తుతం జింబాబ్వే దేశంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఆ మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకొని కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే శ్రీలంక, జింబాబ్వే జట్లతో జరిగే టోర్నీలకు దూరంగా ఉంటున్నారు.