Raksha Bandhan Quotes And Wishes: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ను ఈ ఏడాది ఆగస్టు 9న ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మార్కెట్లో దొరికే అందమైన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సోదరులకు పోస్టుల ద్వారా రాఖీలను పంపించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది దేశ విదేశాల్లో ఉండడంవల్ల కలుసుకోవడానికి కుదరడం లేదు. దీంతో ఆన్లైన్ ద్వారా వారికి విషెస్ చెబుతున్నారు. అంతేకాకుండా మరికొందరు రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలుపాలని అనుకుంటారు. అయితే ఈ శుభాకాంక్షలు అందమైన వ్యాఖ్యలతో చెప్పడం వల్ల ఎదుటివారిని ఆకర్షించగలుగుతారు. ఆ అందమైన కొటేషన్స్ ఇలా చెప్పండి..
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు
నీకోసం నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను.. నాకోసం కూడా నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
మన బంధం ఎన్నటికీ విడిపోనిది.. ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
మనం ఎక్కడ ఉన్నా.. మన హృదయాలు కలిసే ఉంటాయి.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
నీతో గడిపిన అద్భుతమైన క్షణాలు.. నా మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
కష్టసుఖాలలో నీకు తోడుగా ఉంటూ.. నిరంతరం మద్దతుగా నిలుస్తానని ఈ సోదరుడు హామీ ఇస్తుండు.. ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు..
నా తోబుట్టువు అయిన నీవు.. నాకు అత్యంత విలువైన బహుమతివి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
ప్రేమ, నవ్వు, అంతులేని జ్ఞాపకాలు నీతోనే ఉన్నాయి.. వాటిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
జీవితం ఎక్కడికి తీసుకెళ్లినా.. నిన్నే తలచుకుంటూ ఉంటానని హామీ ఇస్తూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
నేను ఎక్కడ జీవిస్తున్నా.. నీవే నాకు అత్యంత ప్రియ సోదరుడివి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
ఎప్పటికీ.. ఎన్నటికీ నేను మరువనని మాట ఇస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. ఎంత కష్టం వచ్చినా.. నీ సేవకై నేను ఉంటానని మాట ఇస్తూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
తోబుట్టువుల మధ్య విడదీయరాని బంధం.. రాఖీ బంధం..
మమతానురాగాలు.. బంధాలు.. ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపే రాఖీ బంధన్ శుభాకాంక్షలు.
తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి నీవే సోదరా.. రాఖీ పండుగ శుభాకాంక్షలు..
మనం ఎక్కడ ఉన్నా.. బంధం చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
శాశ్వతమైన అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగ నిలవాలని కోరుకుంటూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
సోదరుడి గానే కాకుండా.. మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు
ప్రతిక్షణం.. నిన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారని రాఖీ పండుగ శుభాకాంక్షలు
అన్ని కష్టాలకు అండగా ఉంటానని తెలుపుతూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
కొన్ని బంధాలు మధ్యలో విడిపోతూ ఉంటాయి.. కానీ ఎప్పటికీ విడిపోకుండా ఉండే మన బంధమే.. రక్ష బంధన్ శుభాకాంక్షలు.