Rahul Gandhi Allegations Election Commission: చింత చచ్చినా పులుపు చావదంటే ఇదే రాహుల్ జీ. ఎన్నికల్లో దశాబ్ధాల మీ పార్టీ కుంభకోణాలు చూసి.. విసిగి వేసారి జనాలు మోడీజీకి పట్టం కడితే ఆయన పాలనను మెచ్చి మూడు సార్లు గద్దెనెక్కిస్తే.. అమెరికా తొత్తుల మాయలోపడి.. ఫండింగ్ అనుసారం బీజేపీని ఎలా తొక్కేయాలో బాగానే ప్లాన్లు వేస్తున్నాడు మన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీని ఎన్నికల్లో ఓడించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ఎలాగూ లేదు. ప్రతిపక్ష పార్టీలకు వచ్చినన్నీ ఓట్లు, సీట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇప్పుడు ఇక మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటే పాడిందే పాడరా పాసుపండ్ల దాస అన్నట్టుగా వల్లెవేశారు. దానికి సరైన ఆధారాలు చూపించడం లేదని బీజేపీ వాదులు మండిపడుతున్నారు. కొన్ని ఓట్లు చూపిస్తే గోల్ మాల్ అవుతుందా? ఇంత పెద్ద దేశంలో కొన్ని ఓట్లను ఎలా ప్రమాణికంగా తీసుకుంటారని బీజేపీ వాదులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
Also Read: కెనడాలో ఖలిస్తాన్ రిపబ్లిక్ రాయబార కార్యాలయమాట?
ఢిల్లీ ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వింటుంటే కామెడీ బాగా చేశారనిపిస్తోంది.. ఎన్నికల అనంతరం ఓట్ల చోరీ, నకిలీ ఓటర్లు, దళారీ వ్యవస్థలు అంటూ ప్రతిసారి ఓటమిని ధ్వంసపరిచేందుకు ఆయన చేసే ప్రయత్నం కొత్తేమీ కాదు. కానీ ప్రజలు మాత్రం ఇదే కథకు ఏడాదికేడాది విసుగుతో కూడిన వ్యతిరేకతను వ్యక్తపరిచారు. రాహుల్ చెప్పింది నిజంగా నిజం అయితే.. తెలంగాణలో , కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. ఇక్కడ కూడా బీజేపీ ఓట్ల గోల్ మాల్ చేసి గెలవొచ్చు కదా.. ఈ పాయింట్ ను రాహుల్ ఎందుకు ప్రస్తావించడం లేదన్నది బీజేపీ వాదుల ప్రశ్న.
ఓటమికి అసలు కారణం తమ పక్షంలో లేదని రుజువు చేయాలనేలా రాహుల్ ఆరోపణలు చేస్తూ మళ్లీ బీజేపీపై తప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. “ఆటంబాంబు లాంటి ఆధారాలు” తమ వద్ద ఉన్నాయట! ఆ బాంబ్ ఎప్పుడు పేలుతుందో తెలీదు కానీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా రోజుకో మాయబాంబ్ పేలుస్తూ ప్రజల మనస్సుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటి ప్రజలు మాత్రం అవే పాత స్టోరీలు వినేంత అమాయకులు కాకపోవడం గమనార్హం.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించినా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను ఎప్పటికీ ప్రజల ముందు ఉంచలేరు. ఎన్నికల సంఘాన్ని హెచ్చరించడమో, అధికారులను బెదిరించడమో కాంగ్రెస్‌కు పరిష్కార మార్గంగా మారిపోయింది. కానీ ప్రజలు మాత్రం ఈ ఆరోపణలపై ఏ మాత్రం విశ్వాసం పెట్టడంలేదు.
ఇదే మోడీజీని మూడుసార్లు ప్రధానిగా గద్దెనెక్కించిన దేశ ప్రజల తీర్పు. కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ఓట్లు వేయకుండా మోడీ పాలనపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి ధృవీకరించారు. నిజాయితీ, దేశభక్తి, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్న నాయకుడు నరేంద్ర మోడీకి తిరుగులేదని సమీక్షలో స్పష్టమైంది.
ఓటమి వచ్చినప్పుడల్లా ఎన్నికల వ్యవస్థను నిందించడం, ఈసీపై శంకలు వేయడం ఒక రాజకీయ పాత అలవాటు అయ్యిందని ప్రజలు గుర్తించారు. ఇది నాయకత్వ లోపాన్ని దాచేందుకు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
మొత్తంగా చెప్పాలంటే ప్రజలు ఇప్పుడు ఓటు వేస్తున్నారు వ్యక్తిత్వానికి, నేతల మౌలిక విలువలకు. దానికి వ్యతిరేకంగా కేవలం ఆరోపణలతో రాజకీయం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరగదు.
పరిణతి, ప్రత్యామ్నాయ ఆలోచనలతో ప్రజల మధ్యకు వచ్చి విశ్వాసాన్ని గెలుచుకోలేకపోతే.. ఓటమి తర్వాత బీజేపీపై, ఎన్నికల సంఘంపైనే తప్పుడు విమర్శలు చేయడం రాహుల్ గాంధీకి శాశ్వతంగా అంటుకున్న అలవాటుగా మారిపోయింది.
ఈ కాకమ్మ కథలు ఎన్నిరోజులైనా ప్రజలు ఇక నమ్మే రోజులు పోయాయి రాహుల్ గాంధీ గారు.. ఎందుకంటే వారు ఓట్లు వేసి నమ్మింది మోడీని.. ఆయన్ను ఓడించే దమ్ములేని రాహుల్ ఇలా ఓట్ల గోల్ మాల్ అంటూ ఎంత రచ్చ చేసినా బీజేపీపై, మోడీపై దేశ ప్రజల విశ్వాసం అస్సలు చెక్కు చెదరదు.
#VoteChori हमारे लोकतंत्र पर Atom Bomb है। pic.twitter.com/jcLvhLPqM6
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025