Rakhi festival celebrate Date: అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని అంటారు. నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. అంటూ జరుపుకునే ఈ వేడుక ప్రతి శ్రావణమాసంలో పౌర్ణమి రోజు వస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ రాఖీనే. అందువల్ల ఈ వేడుకను కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొందరు తమ తోబుట్టువులను కలుసుకునేందుకు విదేశాల నుంచి కూడా వచ్చేవారు కూడా ఉన్నారు. అయితే రాఖీ పౌర్ణమి రోజు వచ్చే ఈ రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 2025 ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రాబోతుంది. ఈరోజున ఏ ముహూర్తంలో రాఖీ కట్టాలో ఇప్పుడు చూద్దాం..
Read More: మీ మొబైల్ నంబర్ లో ఈ నంబర్స్ ఉంటే కష్టాలే!
2025 సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన శ్రావణ పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 1.12 గంటలకు ముగుస్తుంది. అందువల్ల శ్రావణ పౌర్ణమి కాలంలో రాఖీ పండుగ కట్టడం వలన శుభం అని కొందరు పండితులు చెబుతున్నారు. అంటే ఆగస్టు 9 ఉదయం 6.18 గంటల నుంచి మధ్యాహ్నం 1:24 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో రాఖీ కట్టుకోవడం కుదరని వారు ప్రదోషకాలంలో కూడా రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. ప్రదోషకాలం సాయంత్రం 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కూడా రాఖీ కట్టుకోవచ్చని అంటున్నారు.
సోదరులపై ఎంతో ఇష్టంగా ఉండే చెల్లెలు రాఖీని ఈ రోజున కడతారు. అయితే కొంతమంది అవగాహన లేకుండా ఈ రాఖీని వెంటనే తీసిస్తారు. కానీ అలా తీయడం వల్ల ఏమాత్రం మంచిది కాదని కొందరు పందితులు చెబుతున్నారు. సోదరీ రాఖీ కట్టిన మరుసటి రోజు వరకు అలాగే ఉంచుకోవాలని అంటున్నారు. అయితే ఆ తర్వాత ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు కానీ రాఖీ కట్టిన రోజు మాత్రం తీసేయొద్దు అని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాఖీ పండుగ రోజు ధరించిన రాఖిని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తీసేస్తారు. కానీ ఖచ్చితంగా అదే రోజు తీసేయాలని మాత్రం ఎక్కడా లేదు. అయితే మరుసటి రోజు రాఖీని తీసేసిన వారు చెత్తాచెదారంలో కాకుండా ఒక చెట్టు మొదలలో వేయాలని అంటున్నారు.
Read More: నీ సినిమాలు ఆడవు..విలన్ గా చేయి.. ముఖం మీదే చెప్పిన బడా నిర్మాత
రాఖీ కట్టేటప్పుడు ఎన్ని మూడులు వేయాలని కొందరికి సందేహం ఉంటుంది. ఏ శుభకార్యంలోనైనా మూడు ముళ్ళు చేయాలని అంటూ ఉంటారు. అలాగే రాఖీ కట్టే సమయంలో కూడా మూడు మూడులు వేయాలని చెబుతూ ఉంటారు. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షును పెంచుతుంది. రెండవ ముడి అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని పెంచుతుంది. మూడవ ముడి సత్యమార్గంలో పయనించేలా చేస్తుంది. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా.. తన సోదరి ని రక్షించాలి అని తెలిపేందుకే ఈ మూడు ముళ్ళు తన అన్నకు కడుతుంది అని తెలుపుతారు.