AP Cabinet Green Signal Free Bus: ఏపీ క్యాబినెట్( AP cabinet) భేటీ కొనసాగుతోంది. పలు అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం వేయనుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ కి సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి రెండో విడత భూ సమీకరణ పై కూడా నిర్ణయం ప్రకటించనుంది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. వీటన్నింటిపై కులంకుషంగా చర్చించి.. మంత్రుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇప్పటికే మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వాటిపై చర్చించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Read Also: ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టిడిపి
ఎక్కడి నుంచి ఎక్కడికైనా..
మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక విషయాలపై స్పష్టత ఇవ్వనుంది ఏపీ క్యాబినెట్. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విద్యార్థినులు ప్రత్యేకంగా పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ పరిధిలో ఉంటున్నట్లుగా ఏదైనా గుర్తింపు పొందిన కార్డు ద్వారా ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. జీరో పేర్ టికెట్ విధానం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకునేలా నిర్ణయం తీసుకున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్లలో కూడా ఈ పథకం అమలులో ఉండనుంది. ఈనెల తొమ్మిదిన రాఖీ పౌర్ణిమనాడు పథకం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేయనుంది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.
* రాష్ట్రవ్యాప్తంగా 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు అనుమతులు మంజూరు చేయనుంది మంత్రిమండలి.
* తిరుపతి రూరల్ మండలం పేరూరులో 25 ఎకరాల భూమికి బదులుగా.. గతంలో ఒబెరాయ్ హోటళ్ల గ్రూపు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ ను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
* ఎస్బిఐ, యు బి ఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీని పవర్ సెక్టార్కు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
* హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచనుంది.
* జర్నలిస్టుల మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025 కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
* మరోవైపు మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.