Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 28న మంగళవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, సింహంతో పాటు పలు రాశుల వారిపై ప్రభావం ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
కార్యాలయాల్లో ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం ఉంటుంది. వివాహం చేసుకోవాలనుకునేవారికి మంచి సమయం. ప్రతిపాదనలు వస్తుంటాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు.
వృషభం:
కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో వీరు మనశ్శాంతి కోల్పోతారు. వ్యాపారస్తులకు నష్టాలు సంభవిస్తాయి. కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.
మిథునం:
అకారణంగా ఆస్తులను విక్రయించొద్దు. ముఖ్యమైన సమాచారం బాధ కలిగిస్తుంది. యువకులు సరదాగా గడుపుతారు. ఆస్తులు అమ్మాలనుకునేవారి కల నేరవేరుతుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి నిరుత్సహమే ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగం చేసేవారికి సీనియర్ల నుంచి ప్రతి కూల వాతవరణం ఉంటుంది.
సింహం:
పెండింగులో ఉన్న ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే కుటుంబ సభ్యుల బాధ్యతలు ఉంచుకోవాలి.
కన్య:
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో తండ్రి మార్గదర్శకంలో నడుస్తారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.
తుల:
శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు ప్రణాళికవంతంగా ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆటంకాలు కలుగుతాయి.
వృశ్చికం:
పెండింగు పనులుపూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనస్సు:
మీపై ప్రత్యర్థులు విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పదోన్నతులు ఉండే అవకాశం.
మకరం:
బంధువుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువ. వ్యాపారులకు ఊహించని లాభాలు.
కుంభం:
విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా కష్టపడాలి.
మీనం:
ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. ఐటీ రంగంలో పనిచేసేవారికి అనుకూలం. వ్యాపారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఫలితంగా లాభాలు వస్తాయి.