Gold Prices: షాక్.. 81,000లకు ఎగబాగిన వెండి.. బంగారం ధరలూ పైపైకే.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 28న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,560 గా ఉంది.

Written By: Chai Muchhata, Updated On : November 28, 2023 8:28 am

Gold Prices

Follow us on

Gold Prices: కార్తీక మాసం సందర్భంగా పెళ్లిళ్లు చేసుకునేవారికి బంగారం, వెండి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్ లో కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ హైక్ అవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ రేట్ 2016 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ రేట్ మాత్రం ఔన్స్ కు 24.16 డాలర్లు కొనసాగుతోంది. దీంతో ఒక్కరోజులో బంగారం రూ.250 పెరగగా.. వెండి ఏకంగా రూ.1300 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండికి ప్రస్తుతం రూ.81,000లతో ట్రేడ్ అవుతోంది. 2023 నవంబర్ 25న శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 28న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,560 గా ఉంది. నవంబర్ 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,100తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.250 పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,710గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,560 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,560తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,350తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,560తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీ షాక్ ఇచ్చాయి . మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,500గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు రూ.1300 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.78,500గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగుళూరులో 76,250, హైదరాబాద్ లో రూ.81,500తో విక్రయిస్తున్నారు.