India vs China : బతుకమ్మ మొదలైంది. ఈ ప్రకారం పండుగల సీజన్ ప్రారంభమైనట్టే. ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో తక్కువ తీరుగా నిర్వహిస్తుంటారు. దసరా, దీపావళి, చాట్ పూజలతో భారతదేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ పండగలవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నిర్వహించుకునే పండుగలకు.. మనం తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవి చైనాకు చెక్ పెట్టేలాగా ఉన్నాయని తెలుస్తోంది.. త్వరలో జరుపుకోబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాలలోనూ దేశీయంగా తయారైన వస్తువులనే మెజారిటీ ప్రజలు వాడారు. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వివిధ రకాల వస్తువులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. దాన్ని మర్చిపోకముందే నరేంద్ర మోడీ దీపావళి పండుగకు సంబంధించి ఉపయోగించే ప్రమిదల నుంచి మిఠాయిల వరకు స్థానికంగా తయారైనవి మాత్రమే వినియోగించాలని సూచించారు. వాస్తవానికి మనదేశంలో పండగల సమయంలో చైనా దేశం నుంచి విచ్చలవిడిగా వస్తువులు మార్కెట్లో దర్శనమిస్తాయి. ఆ వస్తువులు అత్యంత తక్కువ ధరలో లభిస్తాయి. వాటి వల్ల స్థానికంగా ఉన్న తయారీదారులకు ఉపాధి కరవుతుంది.. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా మేడిన్ ఇండియాకు, మేక్ ఇన్ ఇండియాకు భారత ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా చైనా వస్తువులపై అనధికార నిషేధం విధించింది. లోకల్ మేడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థానికంగా ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని పిలుపునివ్వడం మొదలుపెట్టారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు.
గత ఏడాది లాగే..
ఇక గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మేకింగ్ ఇండియా ఉత్పత్తులను వాడాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా భారత్ – చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు అనేక సంక్లిష్టతల మధ్య సాగుతున్నాయి. ఈ క్రమంలో పండుగ సమయంలో మన దేశంలో తయారైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని నరేంద్ర మోడీ పిలుపునిస్తున్నారు. ఫలితంగా స్థానికంగా ఉత్పత్తుల తయారీ పెరిగింది. వ్యాపారులకు లాభాలు వస్తున్నాయి . ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగ సమయంలో స్థానికంగా తయారైన రాఖీలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేశారని ది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా మనదేశంలో తయారైన రాఖీలు మాత్రమే అమ్ముడవుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల చైనా నుంచి దిగుమతి అయిన రాఖీలకు ప్రతిగా డిమాండ్ లేదని ఆ సంస్థ ప్రకటించింది. గత ఏడాది దీపాలు సమయంలో స్థానికంగా తయారైన దీపాలకు డిమాండ్ పెరిగిందని.. గత కొంతకాలంగా మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న చైనా కంపెనీలకు.. భారత కంపెనీల ఉత్పత్తులు గట్టి పోటీనిస్తున్నాయని వారు వివరించారు.. తక్కువ ధర వల్ల చైనా ఉత్పత్తులు ప్రజల ఆదరణ పొందినప్పటికీ.. అవి నాణ్యంగా లేకపోవడంతో తిరిగి ప్రజలు దేశీయ ఉత్పత్తులను ఆదరించడం మొదలు పెడుతున్నారని వ్యాపారులు అంటున్నారు. పైపులైట్ స్ట్రింగ్స్, బ్యాటరీ తో నడిచే దయాలైట్, ఎల్ఈడి లైట్.. ఫ్లవర్ లైట్.. గోల్డెన్ లైట్ వంటి వస్తువులను భారతీయ కంపెనీలు విరివిగా తయారుచేస్తున్నాయి. వాటిని మన దేశ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా కంపెనీలు కూడా అలాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ.. ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు అంటున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More