Jagan: షర్మిలను జగన్ టార్గెట్ చేశారా? ఆమెను పదవి నుంచి దించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారా? కాంగ్రెస్ హై కమాండ్ ముందు అవే షరతులు పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. సమీక్షలకు తాడేపల్లి కి వస్తున్నారు. అంతే వేగంగా తిరిగి బెంగళూరు చేరిపోతున్నారు. ఈ క్రమంలో జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కీలక భాగస్వామి. బిజెపి అగ్రనేతలు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే ఎన్నికలు మరోసారి ఆ మూడు పార్టీలు కలిసే వెళ్తాయి. ఏపీ ప్రభుత్వ నిర్వహణ విషయంలో చంద్రబాబుకు కేంద్ర పెద్దలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. దీంతో బిజెపిపై ఆశపడితే తనకు ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీతో గత అనుభవాల దృష్ట్యా జగన్ ఆసక్తి కనబరచడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు మాత్రం జగన్ ను పార్టీ హై కమాండ్ తో కలపాలని చూస్తున్నారు. బెంగళూరు నుంచి ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అయితే కాంగ్రెస్ తో కలవాలంటే చాలా రకాల షరతులు జగన్ వారి ముందు పెట్టినట్లు సమాచారం.
* పెట్టిన షరతులు ఇవే నట
జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు అడుగులు వేయాలంటే.. ఏపీలో వైసీపీ ఇచ్చిన సీట్లను కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు తీసుకోవాలి. పవర్ షేరింగ్ ఉండకూడదు. తన మాటకు ఎదురు నిలవకూడదు. గతం మాదిరిగా వైసిపి పూర్తిగా స్వేచ్ఛగా పాలన చేయాలి. ప్రజా రంజక పాలన అందించాలి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలి. అందుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీతో చెలిమికి తాను ఒప్పుకుంటానని జగన్ ముక్కు సూటిగా చెప్పినట్లు సమాచారం. గతం మాదిరిగా ఢిల్లీ పెత్తనాన్ని సహించేది లేదని ముందుగానే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక హోదాకు కూడా సమ్మతిస్తేనే కలిసేందుకు ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం.
* షర్మిలను మార్చితేనే..
మరోవైపు ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాలన్నది మరో ప్రధానమైన డిమాండ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమెతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు జగన్. ఈ ఎన్నికల్లో వైసీపీ డ్యామేజ్ జరగడానికి ఆమె కారణమన్నది ఒక విశ్లేషణ. అయితే మొన్నటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటివరకు ఒక ఎత్తు అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి ఓడిపోయినా షర్మిల అదే పనిగా తనను టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పెద్దల వద్ద జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆమెను తప్పిస్తేనే తాను కాంగ్రెస్ తో కలుస్తానని షరతు పెట్టినట్లు సమాచారం. అయితే ఇవన్నీ బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న చర్చలేనని ఒక రకమైన ప్రచారం అయితే నడుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు బిజెపి విషయంలో వ్యతిరేకంగా వెళ్లి.. లేనిపోని కష్టాలు తీర్చుకోకూడదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొన్ని రోజులు పాటు వేచి చూసి.. అప్పుడు ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagan is close to congress conditions apply
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com