https://oktelugu.com/

Viral Fever: వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

బాడీలో ఇమ్యూనిటీ పవర్ సరిగా ఉంటే ఆరోగ్య సమస్యలు బాధ పెట్టవు. కాబట్టి, ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం హెల్దీ డైట్, ఎక్సర్‌సైజ్ చేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం చేస్తే మీరు ఇమ్యూనిటీ పవర్ ను పొందవచ్చు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 3, 2024 / 04:15 AM IST

    Viral Fever

    Follow us on

    Viral Fever: రోజు రోజుకు వైరల్ ఫీవర్స్ ఫుల్ గా పెరుగుతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి రావడంతో జ్వరాల బారిన పడే వారు ఎక్కువ అవుతున్నారు. ఇక హాస్పిటల్స్ లో బెడ్లు కూడా ఖాళీ ఉండని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లల్నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ జ్వరం బారిన పడుతున్నారు. ఈ జ్వరంతో ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు తగ్గుతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

    ఇది కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన సమయం అనడంలో సందేహం లేదు. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి లేదా ఏదైనా తినడానికి ముందు, రెస్ట్ రూమ్ వాడినా ప్రతిసారి, దగ్గడం, తుమ్మడం వంటి చాలా సందర్భాల్లో కూడా ఎప్పటికప్పుడు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్దచాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇక దగ్గడం, తుమ్మడం చేసినప్పుడు కచ్చితంగా మీ చేతులతో కవర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేసిన తర్వాత చేతులని క్లీన్ చేయడం అసలు మర్చిపోవద్దు.

    బాడీలో ఇమ్యూనిటీ పవర్ సరిగా ఉంటే ఆరోగ్య సమస్యలు బాధ పెట్టవు. కాబట్టి, ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం హెల్దీ డైట్, ఎక్సర్‌సైజ్ చేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం చేస్తే మీరు ఇమ్యూనిటీ పవర్ ను పొందవచ్చు. దీనివల్ల ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా సమస్య రాకముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. దీనికోసం డాక్టర్‌ని ముందుగానే సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మీ ఫ్యామిలీ డాక్టర్‌ని కన్సల్ట్ అయి ఏయే వ్యాక్సిన్స్ తీసుకోవాలో అడిగి వాక్సిన్ తీసుకోండి.

    జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండండి. వారు వాడిన వస్తువులు, కప్స్, పర్సనల్ ఐటెమ్స్, బట్టలకు దూరంగా ఉండటం మరింత మంచిది. దీని వల్ల ఆ వైరస్‌ మన బాడీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడవచ్చు. లేదంటే మీరు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టివారికి నయం అయ్యే వరకు వారికి సంబంధించిన వస్తువులకు వీలైనంత దూరంగా ఉండటం మరీ మంచిది.

    ఎక్కువ వైరల్ ఫీవర్స్ దోమల వల్ల వస్తాయి. కాబట్టి, వాటి నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిముందు, చుట్టు పక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. దోమల నుంచి కాపాడుకునేందుకు బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు. దోమలు పెరగకుండా చూసుకోండి. దోమతెరలు వాడడం మరీ మంచిది. ఇక చుట్టుపక్కల వాతావరణం బాగలేకుంటే క్లీన్ చేసుకోవడం మీ బాధ్యత.

    నీరు: వర్షం కొడుతుంటే నీరు తాగడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ కచ్చితంగా ఈ తప్పు చేయకూడదు. నీరు తాగడం ఇష్టం లేకపోయినా సరే కచ్చితంగా తాగాలి. లేదంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీలో తగినంత నీరు ఉండాల్సిందే. అందుకే మీరు నీరు విషయంలో ప్రతి రోజు జాగ్రత్త పడాలి.