Bhuta Yajna benefits: ఈ భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ జీవితం బాగుండాలని కోరుతూనే ఉంటారు. కావలసిన డబ్బు.. కుటుంబ సభ్యుల సంతోషం.. ఆరోగ్యకరమైన శరీరం ఉండాలని ప్రతి రోజు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఎన్నో రకాల పుణ్యాలు చేస్తూ ఉంటారు. కానీ వీటికంటే ప్రతిరోజు భూత యజ్ఞం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యం పొందవచ్చని చెబుతున్నారు. అసలు భూత యజ్ఞం అంటే ఏమిటి? దీనిని ఎలా చేయాలి?
భూత యజ్ఞం అంటే ప్రత్యేకంగా హోమం గుండం ఏర్పాటు చేసే యజ్ఞం కాదు. మనం ప్రతిరోజు తినే ఆహారంలో మిగిలిన దానిని పంచి పెట్టడమే. భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనం చేసిన తర్వాత పూర్తిగా తెలియకూడదు. ఎంతోకొంత మిగిల్చి దానిని ఇంటి ప్రహరీ గోడపై లేదా పక్షులు వచ్చే ప్రదేశంలో వేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు మనం భోజనం లేదా ఆహారం తిన్న తర్వాత వీటికి సమర్పించడం వల్ల అవి ఎంతో సంతోషిస్తాయి. పుణ్యం కోసం ఎన్నో రకాలుగా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రాణులు ఆకలిని తీర్చుకుంటాయి. ఇలా తీర్చుకొని అవి మనస్ఫూర్తిగా దీవిస్తాయి. ఈ దీవెనలు మనుషులకు పుణ్యాలను కలగజేస్తాయి.
పూర్వకాలంలో రైతులు తాము పండించిన ధాన్యంలో కొంత భాగం ఇంటి ముందు పందిరి కింది భాగంలో వేలాడదీసేవారు. వీటిని పక్షులు తినేవి. ఇలా ఆ కాలంలో వారు చేసిన పుణ్యఫలంతో వారి జీవితాలు ఎంతో సుఖంగా మారేవి. అయితే నేటి కాలంలో చాలామంది ఆహారం తినలేక వృధాగా పడేస్తున్నారు. అంతేకాకుండా ఒక కుటుంబంలో మెతుకు లేకుండా ఊడ్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏ దేవతలు హర్షించరు. కానీ మనం తినే ఆహారంలో కొంత భాగం పక్షులకు లేదా క్షీరదాలకు పెట్టడం వల్ల దైవానుగ్రహం తొందరగా పొందే అవకాశం ఉంటుంది.
తమకు దైవానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వారు చేసే పుణ్యాన్ని బట్టి ఏ దేవుడు అయినా వరం ఇస్తారు. పుణ్యం ఏం మాత్రం చేయకుండా వరం కావాలంటే ఏ దేవుడు ఇవ్వరు. అందువల్ల ప్రతిరోజు పక్షుల కోసం ఎంతో కొంత ఆహారం తీసి దానం చేయడం వల్ల సర్వదేవతలు దీవిస్తూ ఉంటాయి. ఈ పద్ధతులను పిల్లలకు కూడా నేర్పించడం వల్ల వారు తమ తరాలకు అందించగలిగిన వారవుతారు. ఇప్పటికైనా ప్రతిరోజు ఆహారంలో కొంత భాగం ఇలా పంచిపెట్టే ప్రయత్నం చేయాలి.