OG Movie Public Talk: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ కథ మీద దర్శకుడికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కథ రాసుకున్నప్పుడే ఆ సినిమాను తన మైండ్ లో విజులైజ్ చేసుకోవాలి. ప్రతి సీను ప్రతి షాట్ ఎలా తీయాలి, ఏం చేస్తే సినిమా ఇంపాక్ట్ పెరుగుతోంది… థియేటర్లో ప్రేక్షకులు ఏ సీన్ కి విజిల్ వేస్తారు, క్లాప్స్ కొడతారు అనే విజువలైజేషన్ కూడా దర్శకుడు ఉండాలి. ఈ రోజుల్లో వస్తున్న చాలా సినిమాలు కథ మీద పెద్దగా ఫోకస్ చేయకపోయినప్పటికి ఎలివేషన్స్ ఇస్తూ ఎమోషన్ ను హైలెట్ చేస్తూ బ్యా గ్రౌండ్ స్కోర్ తో నడిపిస్తున్నారు… ఇక హీరోలు సైతం మూస ధోరణి కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే మేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి అంటూ హీరోలు దర్శకులకు సలహా లను ఇస్తున్నారు. అందుకే ప్రతి దర్శకుడు విజువల్ వండర్ లాంటి సినిమా తీయాలని ఆలోచిస్తున్నారు తప్ప కథేంటి అనేది పట్టించుకోవడం లేదు…దానివల్ల సినిమాలు గ్రాండియార్ తో తెర్కెక్కినప్పటికి డిజాస్టర్ల బాటపడుతున్నాయి… తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగిన పవన్ కళ్యాణ్ సైతం గత 12 సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన రేంజ్ సినిమా అయితే రావడం లేదు… పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆయన సినిమాలు చూసి విసుగు చెందారు. రొటీన్ సినిమాలు రావడంతో పవన్ కళ్యాణ్ ని ఇలాంటి క్యారెక్టర్ లో మేము చూడలేకపోతున్నాం బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు విపరీతమైన కామెంట్లు అయితే చేశారు… ఇక సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్ లోని మాస్ రేంజ్ యాక్షన్ ని చూపించారని, ఇలాంటి సన్నివేశాలు మనం ఎప్పుడు చూడలేదని థియేటర్లో ఈలలు వేస్తూ, గోలలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు…
ఓజీ సినిమాని చూసిన చాలామంది ఆ సినిమాలోని డైలాగును వాడుతూ ‘ ఒకప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి వచ్చాడు అంటే’ అంటూ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇంటర్వెల్ సీన్ లో పవన్ కళ్యాణ్ ని సుజిత్ చాలా ఎక్స్ట్రాడినర్ గా చూపించాడు. ఈ మొత్తం సినిమాకి ఆ ఒక్క సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి…
కత్తి పట్టుకొని విలయ తాండవం చేసిన పవన్ కళ్యాణ్ ఆ కత్తితోనే రౌడీల తలలు తెగ నరికాడు. ఆ దెబ్బకి స్క్రీన్ మొత్తం రక్తపు మడుగులతో నిండిపోయింది… పదేళ్లలో చాలా తుఫాన్లు వచ్చినప్పటికీ వాడు నరికిన రక్తపు మరకలు మాత్రం ఏ తుఫాను కడగలేక పోయింది అనే డైలాగు పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి బాగా సెట్ అవుతోంది.
12 సంవత్సరాల క్రితం ఆయన క్రియేట్ చేసిన హిస్టరీని మరోసారి రిపీట్ చేస్తూ అదే స్థాయిలో సక్సెస్ ని అందుకున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని చూసి నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ట్వీట్ చేస్తూ ఉండటం విశేషం…