Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 22న ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్రాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకు సాగాలి. భవిష్యత్ గురించి ఆలోచన చేస్తారు.
వృషభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరికి తమ ప్రతిభ ఆధారంగా గుర్తింపు వస్తుంది. విహారయాత్రకు వెళ్లడానికి సిద్ధమవుతారు. ఆధ్యాధ్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
మిథునం:
కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో పెట్టుబడులతో జాగ్రత్త. ఇతరులను ఆషామాషీగా నమ్మొద్దు. పిల్లల కెరీర్ విషయంలో తగిన సలహాలు ఇస్తుంటారు.
కర్కాటకం:
కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామితో ఉన్న సమస్యలు పరిష్కారానికి దారి చూపుతాయి. గతంలో ఉన్న వివాదాలు నేటితో సమసిపోతాయి. సంబంధాల్లో బలం పెరుగుతుంది.
సింహం:
కొన్ని ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. కార్యాలయాల్లో ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెడుతూ ఉండాలి.
కన్య:
ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యాలయాల్లోని ఉద్యోగులకు తోటి వారి మద్దతు పెరుగుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉల్లాసంగా గడుపుతారు.
తుల:
భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. రక్తసంబంధీకుల్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన పనికోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది.
వృశ్చికం:
ఒక వ్యవహారంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. గతంలో పెండింగులో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.
ధనస్సు:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ విషయాల్లో ఎక్కువగా లీనమవుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సాంప్రదాయ పద్ధతుల్లో ముందుకు సాగాలని అనుకుంటారు.
మకరం:
కొత్త పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొందరు శత్రువులు పనుల్లో ఆటంకం సృష్టించే అవకాశం ఉంది. ఒక పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసేవరకు వదలకండి.
కుంభం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో నియంత్రణలో ఉండాలి. భాగస్వామి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం.
మీనం:
ఇన్నిరోజులు పడ్డ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆత్మీయుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరగవచ్చు. ఒకరి నుంచి శుభవార్త వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పడాలి.