Horoscope Today: ఈ రెండు రాశులపై కన్నయ్య మనసు.. వారు ఏం చేసినా విజయమే..

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అంతేస్థాయిలో ఖర్చులు ఉంటాయి. కోపంగా ఉన్న జీవిత భాగస్వామిని సంతోష పరిచేందుకు ప్రయత్నించాలి.

Written By: Chai Muchhata, Updated On : August 26, 2024 8:03 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేషం, కన్య రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా మరికొన్ని రాశులపై శివుడి అనుగ్రహం కూడా ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

వృషభ రాశి:
పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అంతేస్థాయిలో ఖర్చులు ఉంటాయి. కోపంగా ఉన్న జీవిత భాగస్వామిని సంతోష పరిచేందుకు ప్రయత్నించాలి.

మిథున రాశి:
ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు పెరిగే అవకాశాలు ఎక్కువ. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

కర్కాటక రాశి:
ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ప్రత్యర్థుల నుంచి తప్పించుకోగలుగుతారు.జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

సింహారాశి:
విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభదాయకమైన వ్యాపారం చేస్తారు. వ్యాపారులు సీనియర్ల సలహా తీసుకోవాలి. మనసు ఆందోళనకరంగా ఉంటుంది.

కన్య రాశి:
ఉద్యోగులు ఆందోళనతో ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.

వృశ్చిక రాశి:
కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంగా ఆందోళనతో ఉంటారు. ఆర్థికంగా లాభపడుతారు.

ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సాయంత్రం పిల్లలతో సరదాగా గడుపుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మకర రాశి:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో విభేదాలు ఉండొచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదం నేటిత సమసిపోతుంది.

కుంభరాశి:
ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీనరాశి:
ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. బ్యాంకు రుణాల రికవరీ కోసం కొందరు ఇంటికి వస్తారు. వివాహ ప్రయత్నాలు సీరియస్ గా సాగుతాయి. విద్యార్థులు పరీక్ష పోటీల్లో పాల్గొంటే అందులో విజయం సాధిస్తారు.