https://oktelugu.com/

Satellite smartphones : సిగ్నల్స్ లేకపోయిన కాల్ చేసుకోవచ్చు.. త్వరలో శాటిలైట్ స్మార్ట్‌ఫోన్లు

శాటిలైట్ స్మార్ట్‌ ఫోన్లు అంటే మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని దగ్గర కూడా పనిచేసేవి. శాటిలైట్‌కు స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం వల్ల ఇది పనిచేస్తుంది. ఒక ప్రత్యేక టెక్నాలజీతో అంతరిక్షంలోని ఉపగ్రహానికి ఓ రకమైన సిగ్నల్ కనెక్ట్ చేస్తారు. ఆ ఉపగ్రహం సిగ్నల్‌ను తీసుకుని వేరే దానికి ప్రసారం చేస్తుంది. ఇలా నెట్‌వర్క్ లేకుండా మొబైల్‌ను ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2024 / 03:23 AM IST

    Satellite smartphones

    Follow us on

    Satellite smartphones : కాలంతో పాటు టెక్నాలజీ కూడా రోజురోజుకి మారుతుంది. నేటి యుగంలో దాదాపు అంతా టెక్నాలజీతోనే నడుస్తోంది. యువత కూడా ఈమధ్య కాలంలో ఎక్కువగా టెక్నాలజీకి బానిస అవుతున్నారు. ఒకప్పుడు అందరూ కీప్యాడ్ మొబైల్స్ వాడేవాళ్లు. ఎవరో ఒకరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవాళ్లు. కానీ ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. ఎవర్ని చూసిన మొబైల్ వాడుతూనే కనిపిస్తున్నారు. అయితే ఇవి సిగ్నల్స్ ఉన్న ప్రాంతంలో మాత్రమే పనిచేస్తాయి. కొండలు, అడవులు, పర్వతాలపై అసలు నెట్‌వర్కే ఉండదు. దీంతో ఆ ప్రాంతంలో సిగ్నల్‌తో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇకపై ఇలాంటి సమస్యలేవి ఉండవు. హిమాలయ పర్వతాల్లో కూడా మీరు స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం కొన్ని మొబైల్ సంస్థలు త్వరలో శాటిలైట్ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఇంతకీ శాటిలైట్ స్మార్ట్‌ ఫోన్లు అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    శాటిలైట్ స్మార్ట్‌ ఫోన్లు అంటే మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని దగ్గర కూడా పనిచేసేవి. శాటిలైట్‌కు స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం వల్ల ఇది పనిచేస్తుంది. ఒక ప్రత్యేక టెక్నాలజీతో అంతరిక్షంలోని ఉపగ్రహానికి ఓ రకమైన సిగ్నల్ కనెక్ట్ చేస్తారు. ఆ ఉపగ్రహం సిగ్నల్‌ను తీసుకుని వేరే దానికి ప్రసారం చేస్తుంది. ఇలా నెట్‌వర్క్ లేకుండా మొబైల్‌ను ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. తుఫాను, సునామీ సమయంలో కూడా శాటిలైట్ స్మార్ట్ ఫోన్లు పనిచేస్తాయి. వీటిపై వివో, జియోమి, హువాయ్‌ వంటి పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ ఆపిల్ ఫోన్‌లో ఉంది. కానీ ఇది మనదేశంలో పనిచేయదు. ఈ టెక్నాలజీని దేశంలోకి త్వరగా తీసుకురావాలని చూస్తోంది. అయితే స్మార్ట్ ఫోన్ ధరల కంటే శాటిలైట్ స్మార్ట్‌ ఫోన్ ధరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కొన్ని సంస్థలు మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

    శాటిలైట్ స్మార్ట్ ఫోన్‌లను భారత్‌లోకి తీసుకురావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే సిగ్నల్స్ లేకపోయిన కాల్స్ చేసుకోవచ్చు, నెట్‌‌వర్క్ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల పర్వతాలు, అడవులు, కొండల్లో నివసించే వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదైనా ప్రమాదం వచ్చిన వెంటనే సాయం అందించడానికి సులువు అవుతుంది. కొండ ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా వస్తువులు కావాలన్నా అన్నింటికి చాలా దూరం నడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వచ్చిన డాక్టర్‌ను సంప్రదించడానికి కూడా సమయం పడుతుంది. అదే సిగ్నల్స్ వస్తే కనీసం కాల్ చేసి అయిన మనిషి ప్రాణాలు బ్రతికించుకోవడానికి ఓ అవకాశం ఉంటుంది. అయితే భారత్‌లోకి ఈ సేవలు ఎప్పటి నుంచి వస్తాయో కచ్చితంగా చెప్పలేం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ స్పీడ్ బట్టి చూస్తే తొందరగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.