Navratri Festival 2024: దసరా పండుగ రాకతో దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఊరూరా దుర్గామాతను ప్రతిష్టించి పూజించేందుకు భక్తులు, ఉత్సవ సమితులు, యూత్ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఊరూరా, పట్టణాల్లో దుర్గామాతను ప్రతిష్టించేందుకు ప్రత్యేకంగా మండపాలు వేస్తున్నారు. దసరాకు తొమ్మిది రోజుల ముందు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దసరా, దేవీ నవరాత్రులు కూడా ఒకటి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏరంగు దుస్తులు ధరించి పూజిస్తే మంచిదో తెలుసుకుందాం.
మొదటిరోజు
నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు. ఈ రోజు పర్వతాల దేవతగా కొలుస్తారు. పసుపురంగు దుస్తులు, చీక కట్టుకుని పూజిస్తే ఎంతో మంచిది. ఇది పండుగ ప్రారంభాన్ని, కొత్త శక్తిని సూచిస్తుంది.
రెండో రోజు..
ఇక రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా కొలుస్తారు. బ్రహ్మచారిణి జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ రోజు ఆకుపచ్చరంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం మంచింది. ఆకుపచ్చ రంగు ప్రకృతిని, సంతానోత్పత్తిని, శ్రేయస్సును సూచిస్తుంది. జీవితం సుఖంగా సాగుతుంది. ఆకుపచ్చరంగు మన జీవతానికి ప్రకాశాన్ని కూడా అందిస్తుంది.
మూడోరోజు..
ఇక దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు ధైర్యదవత అయిన చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు బూడిదరంగు దుస్తులు వేసుకుంటే మంచింది. ఇది బలమైన రంగు శక్తిని సూచిస్తుంది. స్థిరత్వాన్ని సూచిస్తుంది. చంద్రఘంటా అమ్మవారు శక్తి వంతమైన వారిగా చెబుతారు. అందుకే బూడిదరంగులో ఉన్న దుస్తులు ధరించాలి.
నాలుగోరోజు..
నవరాత్రుల్లో నాలుగో రోజున అమ్మవారు కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు. ఆమె శక్తికి చిహ్నంగా భావిస్తారు. కూష్మాండ అమ్మవారిని పూజించేందుకు నారింజరంగు దుస్తులు ధరించడం మంచిది. నారింజరంగు గాజులు వేసుకుంటే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ఈరోజు ఇంటిని బంతిపూలతో అలంకరించాలి.
ఐదో రోజు..
ఐదో రోజు కర్తికేయుని తల్లి అయిన స్కంద మాతగా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో పూజించాలి. తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి ప్రతీక, సామరస్యాన్ని సూచిస్తుంది. పండుగ సమయంలో శాంతి కోసం పిలుపు ఇవ్వడం అని అర్థం వస్తుంది.
ఆరో రోజు
నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు కాత్యాయినిగా దర్శనమిస్తారు. కాత్యాయిని మాత శక్తికి, శౌర్యానికి ప్రతిరూపం. ఈ రోజు ఎరుపురంగు దుస్తులు ధరించి పూజించడం మంచింది. అభివృద్ధిని, ప్రేమను అందిస్తుంది.
ఏడోరోజు..
ఇక నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మహాగౌరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ప్రశాంతతను, స్వచ్ఛతను అందించే దేవత. ఆరోజు రాయల్ బ్లూ కలర్ దుస్తులు వేసుకుంటే మంచింది. రాయల్ బ్లూ కలర్ నమ్మకాన్ని, ప్రశాంతతను సూచించే రంగు.
ఎనిమిదో రోజు..
ఇక ఎనిమిదో రోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఈ రోజు గులాబి రంగు వస్త్రాలు ధరించడం మంచింది. పింక్ కలర్ ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. గులాబిరంగు దుస్తులు ధరించి గులాబీ పూలతో అమ్మవారిని ఆరాధించాలి.
తొమ్మిదో రోజు..
నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున దుర్గాదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తాము. ఆమె ఆధ్యాత్మికతకు, ఆశయానికి చిహ్నం. ఆరోజు లావెండర్ కలర్ దుస్తులు వేసుకుని అమ్మవారిని పూజిస్తే చాలా మంచింది. ఇంటిని కూడా ఆవెండర్ రంగుతో అలంకరించడం మంచిది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More