Deputy CM Pawan Kalyan : తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 11 రోజులపాటు దీక్షకు ఉపక్రమించారు పవన్. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఈరోజు దీక్షను విరమించారు. తిరుమల లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. అక్కడ నుంచి వివాదం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వివాదం నడిచింది. అయితే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దేశంలో సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని.. దానిని అడ్డుకోవాల్సిన వ్యవస్థ రావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. అయితే హిందూ సమాజం ఎక్కువగా పవన్ అభిప్రాయంతో ఏకీభవించింది. పవన్ పిలుపునకు అన్ని వర్గాలు ఆహ్వానించాయి. అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. నటుడు ప్రకాష్ రాజ్ అయితే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దేశంలో మత వివాదాలు చాలవా? కొత్త వివాదాలు ఎందుకు పవన్? అధికారంలో ఉన్నది మీరే కదా.. చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపునకు కారణం అయ్యింది. అప్పటినుంచి పవన్, ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది.
* లోక కళ్యాణం కోసం
మరోవైపు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. అందులో భాగంగావిజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ మెట్లను శుభ్రం చేశారు.అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పటినుంచి ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ లడ్డు వివాదంపై పవన్ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై కూడా పవన్ స్పందించారు. తాను ప్రాయశ్చిత్త దీక్ష చేసినది లడ్డు వివాదంపై కాదని.. లోక కళ్యాణం కోసమని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగాహిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు పవన్. వాటన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పుకొచ్చారు.
* చేతిలో ఎరుపు రంగు పుస్తకం
అయితే ఈరోజుతో ప్రాయశ్చిత్త దీక్ష ముగిసింది. మంగళవారం తన ఇద్దరు కుమార్తెలతో కలిసితిరుమల చేరుకున్నారు పవన్.అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసిబయటకు వచ్చారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేతిలోఎరుపు రంగులో కూడిన పెద్ద పుస్తకం కనిపించింది. అది వారాహి డిక్లరేషన్ పుస్తకం అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.అంతకు ముందుపవన్ తన చిన్న కుమార్తె తరుపున డిక్లరేషన్ ఇచ్చారు.ఆమె తల్లి క్రిస్టియన్ కావడంతో.. ఎటువంటి వివాదాలు తలెత్తకుండా కుమార్తె తరఫున పవన్ డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మైనర్ కావడంతో ఆమె తరుపున పవన్ ఇవ్వాల్సి వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే పవన్ తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. తిరుమలలో పవన్ వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉన్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More