Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 4న శనివారం ద్వాదశ రాశులపై పునర్వుసు, పుష్య నక్షత్రాల ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి ప్రయోజనాలు.. మరికొందరికి నష్టాలు ఉంటాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
మానసిక సమస్యలు ఎదురు కావొచ్చు. వీటి పరిష్కారినికి తండ్రి సలహా తీసుకోవాలి. ప్రతి పనిని ప్రణాళికతో చేయడం వల్ల ఈజీ అవుతుంది. కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది.
వృషభం:
ఇంట్లో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు మద్దతుగా ఉంటారు. పెళ్లి చేసుకునేవారికి సంబంధాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు సలహాలు తీసుకోవాలి.
మిథునం:
సోదరులతో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుంది.
కర్కాటకం:
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పనుల్లో మార్పులు రావొచ్చు. అయితే వీటి వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండండి. వైద్య సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
సింహం:
భాగస్వామితో చేసే వ్యాపారం అనుకూలిస్తుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. పెట్టుబడులకు అనువైన కాలం. ఉద్యోగులు వాదనలకు దిగొద్దు. లేకుంటే పదోన్నతికి అడ్డంకులు ఏర్పడుతాయి.
కన్య:
వ్యాపారులకు ప్రతికూల వాతావరణం. కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. అయితే కొంత డబ్బలు కూడగట్టడంలో విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:
ఒప్పందాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో గొడవలు ఉంటే ఈరోజుతో సమసిపోతాయి. పోటీ పరీక్షల్లో రాణించాలనుకునేవారు కొంచెం కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చికం:
ఇతరులు విమర్శలు చేసే అవకాశం. అయినా వాదనలకు దిగొద్దు. వ్యాపారంలో భాగస్వామి మద్దతు కోసం ప్రయత్నిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు:
వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. కొన్ని పనుల్లో వ్యతిరేకత రావొచ్చు. వ్యాపారులకు లాభదాయకమే. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
మకరం:
ఉపాధి రంగంలోని వారికి ప్రయోజనాలు. ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం. ఖర్చులు పెరిగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వండి.
కుంభం:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తండ్రి సలహా తీసుకోవాలి. పిల్లల వివాహం గురించి ఆలోచిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఓ సమాచారం సంతోషాన్నిస్తుంది.
మీనం:
వ్యాపారులు ఒప్పందాలను చేసుకుంటారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. పెండింగులో ఉన్న పనులకోసం తీవ్రంగా కష్టపడుతారు.