https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 ఇంట్రో రివ్యూ: అవినీతిపై శంకర్ మార్క్ పాశుపతాస్త్రం…

ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ గా శంకర్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా భారీ బడ్జెట్లు అవ్వడం నిదానంగా ఒక సినిమా చేసిన తర్వాత మరో సినిమా చేస్తున్నాడు.

Written By: , Updated On : November 4, 2023 / 08:10 AM IST
Bharateeyudu 2

Bharateeyudu 2

Follow us on

Bharateeyudu 2: సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు సినిమాలు తీసినప్పటికీ కొంతమంది డైరెక్టర్లు తీసే సినిమాలు మాత్రం జనాలకి ఎప్పటికీ గుర్తుంటాయి. అలాంటి డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఈయన తీసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈయన లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. 1996 వ సంవత్సరంలో శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా కి సంబంధించిన ఇంట్రో వీడియోని సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది ఇక ఇందులో ప్రధానంగా భారతీయుడు సినిమా ఏ కథాంశం తో అయితే తెరకెక్కిందొ అదే కథాంశం తో ఈ సినిమా కూడా రాబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఆ ఇంట్రో వీడియో చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ముఖ్యంగా లంచం తీసుకునే వాళ్ళ అంతు చూడటానికే భారతీయుడు 2 వచ్చేస్తున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక్క ఇంట్రో వీడియో తో సినిమా మీద హైప్ తీసుకొచ్చిన శంకర్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత రెండు సంవత్సరాల కింద ప్రొడ్యూసర్లు ఈ సినిమాని ఆపేశారు.ఇక గత సంవత్సరం కమల్ హాసన్ లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ అనే సినిమాతో ఒక అదిరిపోయే హిట్టు కొట్టాడు. దాంతో తెలుగు, తమిళం లో కమల్ హాసన్ మార్కెట్ భారీగా పెరిగింది. ఇక ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి భారతీయుడు 2 ప్రొడ్యూసర్లు ఆగిపోయిన సినిమాని మళ్లీ సెట్స్ మీదికి తీసుకొచ్చారు.ఇక ఈ సినిమా 2024 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తుంది. డైరెక్టర్ శంకర్ ఇటు భారతీయుడు 2 సినిమా చేస్తూనే, అటు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ గా శంకర్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా భారీ బడ్జెట్లు అవ్వడం నిదానంగా ఒక సినిమా చేసిన తర్వాత మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా చాలా ప్రెస్టేజీయస్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కావడం వల్ల వీటికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా శంకర్ చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ చేసిన కూడా సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి శంకర్ డిసిజన్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలతో శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టి మరోసారి ఇండియాలో తనే టాప్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమాలతో శంకర్ ఈ మేరకు సక్సెస్ లు అందుకుంటాడో…

Bharateeyudu 2 - An Intro | Kamal Haasan | Shankar | Anirudh | Subaskaran | Lyca | Red Giant