Makar Sankranti 2025: అందరూ ఎంతగానో ఎదురు చూసే సంక్రాంతి(Sankranti) పండుగ రానే వస్తోంది. ఈ పండుగ నాడు సూర్యుడు(Sun) ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల(Horoscope) వారికి కుబేర యోగం రానుంది. కొన్ని రాశుల వారు ఇప్పటికీ ఏలి నాటి శని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. శని ఒక మనిషికి ఎంత మంచి(Good) చేస్తుందో.. దాని కంటే ముందు ఎక్కువ కష్టాలను తెచ్చి పెడుతుంది. ఏలి నాటి శని ఉంటే మాత్రం జీవితంలో ఏ పని అనుకున్నా కూడా సరిగ్గా జరగదు. ఏ పని తలపెట్టిన కూడా అన్నింటికి ఆటంకమే(Fail) ఏర్పడుతుంది. అయితే ఈ సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఏలి నాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో వీరికి ఇక నుంచి అన్ని కూడా మంచి రోజులే రానున్నాయి. మరి ఈ సంక్రాంతి నుంచి మంచి రోజులు రానున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
సంక్రాంతి నుంచి మేష రాశి వారికి అన్ని కూడా మంచి రోజులే రానున్నాయి. ఏలి నాటి శని తొలగిపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఇకపై ఏ పని తలపెట్టిన కూడా అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో అయితే అన్ని లాభాలే పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే మాత్రం మేష రాశి వారికి ఇది సరైన సమయం.
మిధున రాశి
ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్ని కూడా మిధున రాశి వారికి తొలగిపోతాయి. ఇకపై అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అన్ని కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఇతరులకు అప్పులు మాత్రం ఇవ్వకండి. వీటివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇదే సరైన సమయం.. వృథా చేసుకోవద్దు.
కన్యా రాశి
సంక్రాంతికి వచ్చే మార్పుల వల్ల కన్యా రాశి వారికి మంచి జరగనుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అన్నింటా విజయమే లభిస్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు అన్ని కూడా విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇకపై అన్ని మంచి రోజులే. మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు క్లియర్ అవుతాయి. ఇకపై అన్ని కూడా మంచి రోజులే వస్తాయని పండితులు సూచిస్తున్నారు.
మకర రాశి
సూర్యుడి సంచారం వల్ల మకర రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు అన్ని కూడా ఒకసారి జరుగుతాయి. ఆదాయం ఇంతకు ముందు కంటే పెరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.