https://oktelugu.com/

Maha Shivaratri: ఈ ఆలయంలోకి నిత్యం శ్వేతనాగు వస్తుందట.. ఆ అద్భుతం ఎక్కడ జరుగుతుందంటే?

భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఆయా గ్రామాలు పట్టణాలు నగరాల్లో శివాలయాలు పురాతన కాలం నుంచే ఉంటూ వస్తున్నాయి.

Written By: , Updated On : February 16, 2025 / 02:00 AM IST
Maha Shivaratri (1)

Maha Shivaratri (1)

Follow us on

Maha Shivaratri: త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడిని సేవిస్తే ఆజన్మ పాపాలని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామి ఎక్కడ కొలువై ఉన్నా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ప్రతి సోమవారం శివాలయం లోకి వెళ్లి అభిషేకం ఆ తర్వాత అర్చనలు చేసి ఆ బోళా శంకరుడి అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తారు. అయితే ప్రతి సోమవారం మాత్రమే కాకుండా ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల జీవితంలో అంతా మంచే జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఈరోజు నా శివుడికి అభిషేకం చేసినా లేదా శివ దర్శనం చేసుకున్న సర్వపాపాలు మాయమవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇది తెలుసుకున్న చాలా మంది భక్తులు శివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఓ ఆలయం మహా శివరాత్రికి ముస్తాబవుతుంది. అయితే ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ ఓ తెల్లటి పాము నిత్యం తిరుగుతూ ఉందట. ఇంతకీ ఆ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఆయా గ్రామాలు పట్టణాలు నగరాల్లో శివాలయాలు పురాతన కాలం నుంచే ఉంటూ వస్తున్నాయి. కొన్ని శివాలయాలు వందేళ్ళ చరిత్రను కలిగి ఉన్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాల గూడెం లోని ఓ శివాలయం వందేళ్ళ ఇక్కడ ఉంటుంది. ఇందులో నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆలయం చుట్టూ ఓ తెల్లటి పాము తిరుగుతూ ఉంటుందట. ఈ పాము భక్తులను చూసి ఎలాంటి ఆందోళన చెందకుండా ఉంటుందట. అలాగే భక్తుల సైతం ఆ పాము కనిపించగానే దండం పెట్టుకొని వెళ్తారట. ఈ విషయాన్ని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే ఈ ఆలయానికి ఓ చరిత్ర ఉందని వారు పేర్కొంటున్నారు. పురాతన కాలంలో ఓ పొలం గట్టుపై ఓ రైతు నిద్రిస్తుండగా తన కలలో ఉమామహేశ్వర స్వామి వచ్చి తాను ఇక్కడ కొలువై ఉన్నానని తనకు ఆలయం నిర్మించాలని చెప్పాడు. అయితే ఈ విషయం గ్రామస్తులు కి చెప్పి ఉమా మహేశ్వరుడు చెప్పిన ప్రదేశంలో పరిశీలించగా అక్కడ ఒక శివలింగం లభించింది. దీంతో గ్రామస్తులు అంతా కలిసి అప్పటినుంచి ఆ శివలింగానికి పూజలు చేసి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి ఈ శివాలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా శివుడి మెడలో పాము ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో శివాలయంలోకి నాగుపాము రావడం చాలామంది చూశారు. అయితే ఓ తెల్లటి పాము ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా పాము తిరగడం ఆ స్వామి మహిమనేనని అంటున్నారు. అలాగే ఈ శివరాత్రికి ఈ శివాలయం ముస్తాబు అవుతోంది. ఈరోజు నా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శివాలయంలో శివ దర్శనం కోసం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వారు తరలివస్తారని వారు పేర్కొంటున్నారు.